world cup 2023: మ్యాక్స్‌వెల్ ఆడుతున్న సమయంలో 2.6 కోట్ల వ్యూవర్‌షిప్
ఆస్ట్రేలియా, అఫ్గానిస్థాన్ జట్ల మధ్య ఉత్కంఠ పోరులో ఆసీస్ చారిత్రాత్మక విజయాన్నందుకుంది. అఫ్గాన్ దాదాపు గెలుపు గుమ్మం వరకు చేరింది. కానీ మ్యాక్స్‌వెల్ బ్యాట్ తో వీరవిహారం చేయడంతో అఫ్గాన్ జట్టు ఓటమిని చవిచూడాల్సి వచ్చింది.
- Author : Praveen Aluthuru
Date : 08-11-2023 - 7:11 IST
Published By : Hashtagu Telugu Desk
world cup 2023: ఆస్ట్రేలియా, అఫ్గానిస్థాన్ జట్ల మధ్య ఉత్కంఠ పోరులో ఆసీస్ చారిత్రాత్మక విజయాన్నందుకుంది. అఫ్గాన్ దాదాపు గెలుపు గుమ్మం వరకు చేరింది. కానీ మ్యాక్స్‌వెల్ బ్యాట్ తో వీరవిహారం చేయడంతో అఫ్గాన్ జట్టు ఓటమిని చవిచూడాల్సి వచ్చింది.128 బంతులు ఎదుర్కొని 21 ఫోర్లు, 10 సిక్సర్లతో 201 పరుగుల అద్భుతమైన డబుల్ సెంచరీతో క్రికెట్ ప్రపంచాన్ని ఊపేశాడు. 97 పరుగులకే 7 వికెట్లను కోల్పోయిన ఆసీస్ జట్టును గెలిపించే బాధ్యతను తనపై వేసుకుని జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. మరోవైపు పాట్ కమిన్స్ సమయోచితంగా ఆడటం కూడా మ్యాక్స్‌వెల్‌కు కలిసొచ్చింది. వికెట్ ని కాపాడుకుంటూ 68 బాల్స్ ఆడి కేవలం 12 పరుగుల సాధించి మ్యాక్సికి సహకారం అందించాడు. మ్యాక్స్ వెల్ ఆటని చూసేందుకు ఫ్యాన్స్ బేస్ తో సంబంధం లేకుండా ఎగబడి చూశారు. అతను ఆడుతున్నప్పుడు ఏకంగా 2.6 కోట్ల మంది చూశారు. ఈ వరల్డ్ కప్‌లో నాన్ ఇండియా మ్యాచ్‌కి హాట్‌స్టార్లో ఈ స్థాయిలో ఆదరణ లభించడం ఇదే తొలిసారి. అంతుకుముందు కోల్‌కత ఈడెన్ గార్డెన్స్‌లో దక్షిణాఫ్రికాపై జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ ఇన్నింగ్‌ను 4.4 కోట్ల మంది చూశారు. ఇప్పటివరకు హాట్‌స్టార్ చరిత్రలో ఈ స్థాయిలో వ్యూవర్‌షిప్ నమోదు కాలేదు.
Also Read: Rashmika Fake Video : రష్మిక డీప్ ఫేక్ వీడియో ఫై విజయ్ ఆగ్రహం..