AFG vs NZ Test: బంతి పడకుండానే చరిత్ర.. ఒక్క బంతి కూడా పడకుండా రద్దైన టెస్టులివే..!
గ్రేటర్ నోయిడాలోని షహీద్ విజయ్ సింగ్ పాథిక్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో ఆఫ్ఘనిస్తాన్- న్యూజిలాండ్ మధ్య ఈ క్రికెట్ మ్యాచ్ జరగాల్సి ఉంది.
- By Gopichand Published Date - 12:44 PM, Fri - 13 September 24

AFG vs NZ Test: 5వ రోజు కూడా వర్షం కారణంగా ఆఫ్ఘనిస్తాన్, న్యూజిలాండ్ క్రికెట్ జట్టు మధ్య జరగాల్సిన ఏకైక టెస్టు (AFG vs NZ Test) మ్యాచ్ రద్దయింది. వర్షం కారణంగా 5 రోజుల మ్యాచ్‌లో ఒక్క బంతి కూడా పడలేదు. అలాగే టాస్ ఆఫ్ మ్యాచ్ కూడా జరగలేదు. 91 ఏళ్ల భారత క్రికెట్ చరిత్రలో ఇలా జరగడం ఇదే తొలిసారి. ఇదే సమయంలో 5 రోజుల పాటు ఎటువంటి బంతి ఆడకుండానే ఎనిమిదోసారి టెస్ట్ మ్యాచ్ రద్దు చేయబడింది. ఇంతకు ముందు ఏడుసార్లు ఇలా జరిగింది.
మొత్తం ఐదు రోజుల పాటు మ్యాచ్ రద్దు
గ్రేటర్ నోయిడాలోని షహీద్ విజయ్ సింగ్ పాథిక్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో ఆఫ్ఘనిస్తాన్- న్యూజిలాండ్ మధ్య ఈ క్రికెట్ మ్యాచ్ జరగాల్సి ఉంది. సెప్టెంబరు 9 నుంచి 13 వరకు జరిగిన ఈ టెస్టు మ్యాచ్‌లో వర్షం, మైదానం తడిసిపోవడంతో టాస్ కూడా వేయలేక ప్రతిరోజూ మ్యాచ్‌ను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది.
భారతదేశంలోనే తొలిసారి ఇలా జరిగింది
1933లో తొలిసారిగా భారత్‌లో టెస్టు మ్యాచ్ జరిగింది. అప్పటి నుంచి భారత్ తన 91 ఏళ్ల చరిత్రలో మొత్తం 292 టెస్టు మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇచ్చింది. కానీ ఆఫ్ఘనిస్తాన్- న్యూజిలాండ్ మధ్య జరిగిన ఈ టెస్ట్ మ్యాచ్ భారతదేశంలో ఐదు రోజుల పాటు ఒక్క బంతి కూడా వేయలేని మొదటి టెస్ట్ మ్యాచ్ అయింది.
Also Read: Curd: మధ్యాహ్న భోజనంలో పెరుగు తింటే ఎన్ని ప్రయోజనాలు కలుగుతాయో మీకు తెలుసా?
టెస్టు క్రికెట్ చరిత్రలో ఇలా జరగడం ఎనిమిదోసారి
147 ఏళ్ల టెస్టు క్రికెట్ చరిత్రలో ఇప్పటి వరకు 8 సార్లు మాత్రమే ఇలా జరిగింది. ఒక్క బంతి కూడా ఆడకుండానే ఒక టెస్టు రద్దయింది. కాగా 26 ఏళ్లలో ఇదే తొలిసారి. మొదటిసారిగా ఒక్క బంతి కూడా వేయకుండానే ఒక టెస్టు మ్యాచ్‌ను డిసెంబరు 1998లో రద్దు చేయడం జరిగింది. అదే రోజు పాకిస్థాన్‌లోని ఫైసలాబాద్‌లో పాకిస్థాన్- జింబాబ్వే, న్యూజిలాండ్- భారతదేశం మధ్య మ్యాచ్‌లను రద్దు చేయాల్సి వచ్చింది.
ఇప్పటి వరకు ఒక్క బంతి కూడా వేయకుండానే రద్దైన టెస్టులు
- ఇంగ్లాండ్ vs ఆస్ట్రేలియా (మాంచెస్టర్, 1890)
- ఇంగ్లాండ్ vs ఆస్ట్రేలియా (మాంచెస్టర్, 1938)
- ఆస్ట్రేలియా vs ఇంగ్లాండ్ (మెల్బోర్న్, 1970)
- న్యూజిలాండ్ vs పాకిస్థాన్ (డునెడిన్, 1989)
- వెస్టిండీస్ vs ఇంగ్లండ్ (జార్జిటౌన్, 1990)
- పాకిస్తాన్ vs జింబాబ్వే (ఫైసలాబాద్, 1998)
- న్యూజిలాండ్ vs భారతదేశం (ఫైసలాబాద్, 1998)
- ఆఫ్ఘనిస్తాన్ vs న్యూజిలాండ్ (గ్రేటర్ నోయిడా, 2024)