Pushpa Steps : తగ్గేదే లే… నానమ్మతో కలిసి పాండ్య స్టెప్పులు
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పాన్ ఇండియా మూవీ పుష్ప ఫీవర్ వరల్డ్ క్రికెట్ ను కూడా ఊపేస్తోంది.
- By Hashtag U Published Date - 11:52 AM, Thu - 27 January 22
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పాన్ ఇండియా మూవీ పుష్ప ఫీవర్ వరల్డ్ క్రికెట్ ను కూడా ఊపేస్తోంది. పలువురు స్టార్ క్రికెటర్లు ఈ సినిమాలోని పాటలు, డైలాగులను ఇమిటేట్ చేసి వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఇప్పటికే రవీంద్ర జడేజా, డేవిడ్ వార్నర్, శిఖర్ ధావన్, డ్వేన్ బ్రావో పుష్పను అనుకరించగా తాజాగా టీమిండియా హార్దిక్ పాండ్యా కూడా పుష్ప స్టెప్పులతో అలరించాడు. శ్రీవల్లి సిగ్నేచర్ స్టెప్పును తన నాన్నమ్మతో కలిసి డాన్స్ చేశాడు. చివర్లో ఇద్దరూ కలిసి తగ్గేదేలే అంటూ బన్నీ స్టైల్ ను అనుకరించారు. అనంతరం మా పుష్ప నానమ్మ అంటూ హార్ధిక్ ఆ వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్నాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. క్రికెటర్లు, అభిమానులు, నెటిజన్లు కామెంట్లతో నింపేస్తున్నారు. ముఖ్యంగా వయసు సహకరించకపోయినా కళ్లకు గ్లాసెస్ పెట్టుకుని మనవడితో కలిసి స్టెప్పులేసిన బామ్మపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇప్పటికే ఈ వీడియోను 20 లక్షల మందికి పైగా వీక్షించారు.
ఇదిలా ఉంటే పుష్ప ఫీవర్ కేవలం భారత క్రికెట్ కే పరిమితం కాలేదు. విదేశీ క్రికెటర్లు సైతం పుష్ప మేనియాలో పడిపోయారు.. తాజాగా, వెస్టిండిస్ మాజీ క్రికెటర్ డ్వేన్ బ్రావో.. ఏకంగా స్టేడియంలో స్టెప్పులు వేశాడు. బ్రావో ప్రస్తుతం బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌లో ఆడుతున్నాడు. బీపీఎల్‌లో భాగంగా కొమిల్లా విక్టోరియన్స్, ఫార్చ్యూన్ బారిషల్ మధ్య మ్యాచ్ జరిగింది.. ఈ మ్యాచ్ లో వికెట్ తీసిన ఆనందంలో బ్రావో శ్రీవల్లి పాటకు అల్లు అర్జున్ వేసిన స్టెప్ వేశాడు బ్రావో.. దీంతో.. ఆ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది.అటు బంగ్లా ఆల్ రౌండర్ షకిబుల్ హాసన్ కూడా వికెట్ తీసినప్పుడు తగ్గేదే లే అంటూ అల్లు అర్జున్ మేనరిజాన్ని ఇమిటేట్ చేశాడు. దీంతో పుష్ప మేనియా ప్రపంచాన్నే ఊపెస్తోందంటూ ఫాన్స్ సంబర పడిపోతున్నారు.
Related News
MI vs LSG: నేడు లక్నో వర్సెస్ ముంబై.. విజయంతో ముగించే జట్టు ఏదో..?
IPL 2024 లీగ్ దశ ఇప్పుడు ముగింపు దశకు చేరుకుంది.