HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >Gujarat Titans All Out For 89 Runs

గుజరాత్ ను మడతపెట్టేసిన ఢిల్లీ బౌలర్లు.. 6 వికెట్ల తేడాతో పంత్ టీమ్ ఘన విజయం

ఐపీఎల్ 17వ సీజన్ లో ఢిల్లీ కాపిటల్స్ మెల్లిగా పుంజుకుంటోంది. గత మ్యాచ్ లో లక్నో పై గెలిచిన ఆ జట్టు తాజాగా గుజరాత్ ను చిత్తు చేసింది.

  • Author : Kavya Krishna Date : 17-04-2024 - 11:02 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Gujarat Titans
Gujarat Titans

ఐపీఎల్ 17వ సీజన్ లో ఢిల్లీ కాపిటల్స్ మెల్లిగా పుంజుకుంటోంది. గత మ్యాచ్ లో లక్నో పై గెలిచిన ఆ జట్టు తాజాగా గుజరాత్ ను చిత్తు చేసింది. బౌలర్లు చెలరేగడంతో గుజరాత్ పై 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది.అహ్మదాబాద్‌ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్‌ బౌలర్లు చెలరేగిపోయారు. గుజరాత్‌ బ్యాటింగ్‌ లైనప్‌పై ఎదురుదాడికి దిగి తక్కువ స్కోరుకే పరిమితం చేశారు. ఇషాంత్‌ శర్మ , ముకేశ్‌ కుమార్‌ , ట్రిస్టన్‌ స్టబ్స్‌ ధాటికి కేవలం 89 పరుగులకే కుప్పకూలింది. వికెట్‌కీపర్‌ రిషబ్‌ పంత్‌ రెండు క్యాచ్‌లు, రెండు స్టంపౌట్లు చేసి గుజరాత్‌ పతనంలో కీలక పాత్ర పోషించాడు. గుజరాత్‌ ఇన్నింగ్స్‌లో రషీద్‌ ఖాన్‌ 31 రన్స్ తో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. సాయి సుదర్శన్‌ , తెవాటియా మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. అసలు ఏ దశలోనూ క్రీజులో నిలిచే ప్రయత్నం చేయలేకపోయారు. దీంతో గుజరాత్ ఇన్నింగ్స్ 17.3 ఓవర్లలోనే ముగిసింది. ప్రస్తుత ఐపీఎల్‌ సీజన్‌లో ఇదే అత్యల్ప టీమ్‌ స్కోర్‌. ఐపీఎల్‌లో గుజరాత్‌ టైటాన్స్‌ 100లోపు ఆలౌట్‌ కావడం ఇదే మొదటిసారి.

We’re now on WhatsApp. Click to Join.

చేజింగ్ లో ఢిల్లీ కాపిటల్స్ దూకుడుగా ఆడింది. రన్ రేట్ పెంచుకునే ఉద్దేశంతో వేగంగా టార్గెట్ అందుకునేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలో 4 వికెట్లు కోల్పోయింది. పృథ్వి షా త్వరగానే ఔట్ అయినా ఫ్రేజర్ 20, హోప్ 19 , పంత్ 16 పరుగులతో రాణించారు. ఢిల్లీ 8.5 ఓవర్లలో టార్గెట్ అందుకుంది. ఆ జట్టుకు ఇది మూడో విజయం. తాజా గెలుపుతో ఢిల్లీ పాయింట్ల పట్టికలో ఆరో స్థానానికి చేరుకుంది. మరోవైపు గుజరాత్ కి ఇది నాలుగో ఓటమి.
Read Also : YouTuber Died: పాపులర్ యూట్యూబర్ యాంగ్రీ రాంట్‌మాన్ మృతి


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • delhi capitals
  • Gujarat Titans
  • ipl 2024

Related News

IPL 2026 Points Table

ఐపీఎల్ 2026.. టాప్ ప్లేస్‌లో ఉన్న జ‌ట్టు ఏదీ?

ఐపీఎల్ 2026 పాయింట్ల పట్టికలో పంజాబ్ కింగ్స్ అగ్రస్థానంలో కొనసాగుతోంది. శ్రేయాస్ అయ్యర్ సారథ్యంలోని పంజాబ్ జట్టు ఈ టోర్నమెంట్‌లో ఇప్పటివరకు ఓటమి లేకుండా దూసుకుపోతోంది.

  • Hyderabad vs Delhi

    నేడు ర‌స‌వ‌త్త‌ర పోరు.. స‌న్‌రైజ‌ర్స్ విజ‌యాల‌కు ఢిల్లీ బ్రేక్ వేయ‌గ‌ల‌దా?

Latest News

  • AI : ప్రపంచ ఏఐ కేంద్రంగా భారత్

  • Montra Electric : మార్కెట్ లోకి ‘మోంట్రా ఎలక్ట్రిక్’ వేరియంట్లు

  • Azharuddin : అజహరుద్దీన్ కు భారీ ఊరట

  • Kavitha : కవిత కామెంట్స్ కు కేటీఆర్ కౌంటర్ ఇస్తాడా ?

  • Snap Chat : స్నాప్ చాట్ తరహాలో ఇన్స్టా నుంచి సరికొత్త యాప్

Trending News

    • ఇరాన్ సుప్రీం లీడర్ మోజ్తబా ఖమేనీ పరిస్థితి విషమం!

    • ఫిఫా వరల్డ్ కప్ 2026.. ఇరాన్ స్థానంలో ఇటలీ?

    • ‘పెద్ది’లో శృతి హాసన్ సందడి

    • ఎన్నిక‌ల త‌ర్వాత భారీగా పెర‌గ‌నున్న పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు?

    • ఆరు నెలల పాటు ఇంధన సంక్షోభం తప్పదా? పెంటగాన్ సంచలన నివేదిక!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd