Gareth Southgate: ఇంగ్లాండ్ ప్రధాన కోచ్ గారెత్ సౌత్ గేట్ రాజీనామా
స్పెయిన్ చేతిలో ఓడిన ఇంగ్లాండ్‌కు మరో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. జట్టు ప్రధాన కోచ్ గారెత్ సౌత్ గేట్ తన పదవికి రాజీనామా చేశారు.అయితే ఇంగ్లాండ్ గెలవకపోతే తాను పదవికి రాజీనామా చేస్తానని సౌత్‌గేట్ గతంలో చెప్పాడు,
- By Praveen Aluthuru Published Date - 05:39 PM, Tue - 16 July 24

Gareth Southgate: యూరో 2024(European Championship) ఫైనల్‌లో స్పెయిన్ చేతిలో ఓడిన ఇంగ్లాండ్‌కు మరో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. జట్టు ప్రధాన కోచ్ గారెత్ సౌత్ గేట్(Gareth Southgate) తన పదవికి రాజీనామా చేశారు. ఇంగ్లాండ్ ఫుట్‌బాల్ వెబ్‌సైట్‌లో పోస్ట్ చేసిన ఒక ప్రకటనలో సౌత్‌గేట్ మాట్లాడుతూ.. ఇంగ్లండ్‌కు ఆడటం మరియు ఇంగ్లాండ్‌ను నడిపించడం నా జీవితంలో గొప్ప గౌరవంగా భావిస్తున్నానని చెప్పాడు. జట్టు భవిష్యత్తు కోసం నేను ఎల్లప్పుడూ ఉత్తమంగా పని చేశానని అన్నాడు. అలాగే కొత్త అధ్యాయానికి సమయం ఆసన్నమైందని గారెత్ సౌత్ గేట్ చెప్పారు. అలాగే బెర్లిన్‌లో ఆదివారం స్పెయిన్‌తో జరిగిన ఫైనల్ నా చివరి మ్యాచ్ అని భావోద్వేగానికి లోనయ్యాడు.
102 మ్యాచ్‌ల్లో గొప్ప ఆటగాళ్ల సమూహానికి నాయకత్వం వహించే అవకాశం నాకు దక్కింది. వారిలో ప్రతి ఒక్కరూ జాతీయ జెర్సీని ధరించడం గర్వంగా ఉందని చెప్పారు. అయితే ఇంగ్లాండ్ గెలవకపోతే తాను పదవికి రాజీనామా చేస్తానని సౌత్‌గేట్ గతంలో చెప్పాడు, అయితే ఇటీవలి నివేదికలు అతను FIFA ప్రపంచ కప్ 2026 వరకు పదవిలో ఉండాలని ఇంగ్లీష్ FA కోరుకుంటున్నట్లు వెల్లడించాయి.
102 మ్యాచ్‌లు మరియు దాదాపు ఎనిమిదేళ్లపాటు జట్టు బాధ్యతలు చేపట్టిన తర్వాత త్రీ లయన్స్ కోచ్ గా తన బాధ్యతలను వదులుకుంటున్నట్లు గారెత్ సౌత్‌గేట్ ప్రకటించారు. ఇంగ్లీష్ ఫుట్‌బాల్ అసోసియేషన్ ఈ విషయాన్నీ ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది.
Also Read: Ram Double Ismart : హనుమాన్ నిర్మాతల చేతుల్లోకి డబుల్ ఇస్మార్ట్.. భారీ డీల్..!