HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >For Surya Kumar Sky Is The Limit He Is 360 Degree Player

Surya Kumar Yadav: ఈ SKYకి ఆకాశమే హద్దు

సూర్యకుమార్ యాదవ్... భారత క్రికెట్ అభిమానులు ముద్దుగా స్కై(SKY) అని పిలుపుకుంటారు. ఐపీఎల్ లో చాలా సార్లు విధ్వంసకర ఇన్నింగ్స్ లతో ఆకట్టుకున్నాడు.

  • Author : Naresh Kumar Date : 01-09-2022 - 12:18 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Sky Imresizer (1)
Sky Imresizer (1)

సూర్యకుమార్ యాదవ్… భారత క్రికెట్ అభిమానులు ముద్దుగా స్కై(SKY) అని పిలుపుకుంటారు. ఐపీఎల్ లో చాలా సార్లు విధ్వంసకర ఇన్నింగ్స్ లతో ఆకట్టుకున్నాడు. జాతీయ జట్టులోకి పిలుపు కాస్త ఆలస్యంగానే అందినా… వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటున్నాడు.

టీ ట్వంటీ వరల్డ్ నెంబర్ వన్ ర్యాంకుకు చేరువలో ఉన్న సూర్యకుమార్ తాజాగా ఆసియాకప్ లో హాంకాంగ్ తో జరిగిన మ్యాచ్ లో విశ్వరూపం చూపించాడు. ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. క్రీజులోకి వచ్చిన తొలి రెండు బంతులను స్వీప్ షాట్లతో బౌండరీకి తరలించాడు. ఆయూష్ శుక్లా వేసిన 18వ ఓవర్‌లో సూర్య రెండు ఫోర్లు, ఓ భారీ సిక్సర్‌తో 15 పరుగులు పిండుకున్నాడు. ఆఖరి ఓవర్‌లో వరుసగా రెండు సిక్స్‌లు బాదిన సూర్య.. 22 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత మరో రెండు సిక్స్‌లు కొట్టి భారీ జట్టుకు 192 పరుగుల భారీ స్కోర్ అందించాడు. భారత్ ఇన్నింగ్స్‌లో సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగే హైలెట్‌గా చెప్పాలి.

For his excellent knock of 68* off 26 deliveries, @surya_14kumar is our Player of the Match as #TeamIndia win by 40 runs.

Scorecard – https://t.co/k9H9a0e758 #INDvHK #AsiaCup2022 pic.twitter.com/uoLtmw2QQF

— BCCI (@BCCI) August 31, 2022

ఆకాశమే హద్దుగా చెలరేగిన సూర్యకుమార్ సిక్సర్ల వర్షం కురిపించాడు. హాంకాంగ్ బౌలర్లపై విరుచుకుపడిన సూర్య కేవలం 26 బంతుల్లోనే 6 ఫోర్లు, 6 సిక్సర్లతో 68 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. హరూన్‌ రషీద్‌ వేసిన ఆఖరి ఓవర్లో సూర్య పూనకం వచ్చినట్లు ఊగిపోయి ఏకంగా నాలుగు సిక్సర్లు బాదాడు. సూర్య.. తన హాఫ్‌ సెంచరీని కేవలం 22 బంతుల్లోనే పూర్తి చేశాడంటే, అతని విధ్వంసం ఏ స్థాయిలో ఉందో అర్ధమవుతుంది. సూర్యకుమార్ విధ్వంసకర ఇన్నింగ్స్‌తో భారత్ చివరి ఐదు ఓవర్లలో 78 పరుగులు చేసింది. కీలకమైన టీ ట్వంటీ ప్రపంచకప్ కు ముందు సూర్యకుమార్ ఫామ్ కొనసాగిస్తుండడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు.

Cover Image: BCCI Twitter


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • asia cup 2022
  • sky
  • surya kumar yadav

Related News

Team India players reach Ahmedabad

అహ్మదాబాద్‌లో అడుగుపెట్టిన సూర్య‌ సేన

India vs New Zealand  టీ20 వరల్డ్ కప్ 2026 ఫైనల్‌కు ముందు భారత జట్టు అహ్మదాబాద్‌కు చేరుకుంది. ముంబైలో ఇంగ్లండ్‌పై ఉత్కంఠభరితమైన సెమీఫైనల్‌లో 7 పరుగుల తేడాతో గెలిచిన భారత జట్టు ఆదివారం సాయంత్రం అహ్మదాబాద్ విమానాశ్రయానికి చేరుకుంది. మార్చి 8న నరేంద్ర మోదీ స్టేడియంలో న్యూజిలాండ్‌తో ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ గెలిస్తే టీ20 వరల్డ్ కప్ చరిత్రలో వరుసగా రెండు టైటిళ్లు గెలిచిన తొలి జట్టుగ

  • Suryakumar Yadav, Gautam Gambhir

    ఇంగ్లండ్‌తో సెమీఫైన పై గంభీర్-సూర్య మైండ్ గేమ్..

  • IND vs ENG

    టీ20 వరల్డ్ కప్ సెమీ ఫైనల్లో టీమిండియా డేంజర్ ప్లేయర్స్ వీరే..

Latest News

  • అల్లు అర్జున్- అట్లీ క్రేజీ కాంబో.. ఏప్రిల్ 8న టైటిల్ ప్రకటన!

  • ఇషాన్ కిష‌న్ పెళ్లి ఎప్పుడో తెలుసా?!

  • ఇండిగోకు భారీ షాక్‌.. సీఈవో ప‌ద‌వికి పీటర్ రాజీనామా!

  • ఇరాన్ మ‌రో సంచ‌ల‌న నిర్ణ‌యం.. చ‌మురు ధ‌ర‌లు పెర‌గ‌నున్నాయా?!

  • మహిళల్లో హార్మోన్ల అసమతుల్యత.. ఇవే ల‌క్ష‌ణాలు?!

Trending News

    • భార‌త్ ఘ‌న‌విజ‌యం.. బీసీసీఐ ఏం చేసిందంటే?

    • సిలిండ‌ర్ల స‌ర‌ఫ‌రాపై నిషేధం..?

    • ఐపీఎల్ 2026.. తొలి మ్యాచ్ ఈ జ‌ట్ల మ‌ధ్యే?!

    • మందుబాబులకు గుడ్‌న్యూస్.. ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు

    • టీమిండియా నెక్స్ట్ టార్గెట్ ఇదేనా?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd