HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >Excitement Over The Opener In The Melbourne Test What Is Rohit Going To Do

Rohit Sharma Opener: మెల్‌బోర్న్ టెస్ట్‌లో ఓపెనర్ పై ఉత్కంఠ.. రోహిత్ ఏం చెయ్యబోతున్నాడు ?

పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో రాహుల్, యశస్వి కలిసి 201 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి రికార్డు సృష్టించారు.

  • By Naresh Kumar Published Date - 02:15 PM, Fri - 20 December 24
  • daily-hunt
Rohit Sharma
Rohit Sharma

భారత్, ఆస్ట్రేలియా (Melbourne Test) మధ్య జరుగుతున్న బోర్డర్-గవాస్కర్ సిరీస్‌లో నాలుగో టెస్ట్ మ్యాచ్ మెల్‌బోర్న్ క్రికెట్ స్టేడియంలో జరగనుంది. ఈ మ్యాచ్‌లో భారత్‌కు ఓపెనర్‌ ఎవరు? ఈ ప్రశ్న చాలా మంది క్రికెట్ అభిమానుల మదిలో మెదులుతుంది. ఆస్ట్రేలియా టూర్‌లో గత 3 మ్యాచ్‌ల్లో కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్ ఓపెనర్లుగా రాణించారు.

పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో రాహుల్, యశస్వి కలిసి 201 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి రికార్డు సృష్టించారు. ఈ నేపథ్యంలో రెండో టెస్టులో రోహిత్ శర్మ తిరిగి వచ్చినప్పటికీ అతను 6వ నంబర్‌లో బ్యాటింగ్ చేశాడు. అయితే రెండో టెస్టులో రాహుల్, యశస్వి జోడీ శుభారంభం ఇవ్వలేకపోయినా.. మూడో టెస్టులో ఓపెనర్‌గా కేఎల్ రాహుల్ భారత్‌కు భారీ ఇన్నింగ్స్ ఆడాడు.అందువల్ల మెల్‌బోర్న్ క్రికెట్ స్టేడియంలో జరిగే నాల్గవ టెస్ట్ మ్యాచ్‌లో కూడా రాహులే ఓపెనింగ్ పాత్ర పోషించవచ్చు. ఈ పరిస్థితుల్లో రోహిత్ తన స్థానాన్ని త్యాగం చేయాల్సి ఉంది.

భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న టెస్ట్ సిరీస్ 1-1తో సమమైంది. ఇప్పుడు మెల్‌బోర్న్‌లో ఎవరు గెలిస్తే వారే సిరీస్‌లో ముందంజ వేస్తారు. ఈ పరిస్థితిలో రెండు జట్లూ తమ అత్యుత్తమ ప్లేయింగ్ ఎలెవన్‌తో మైదానంలోకి రావాలని కోరుకుంటున్నాయి. అయితే నాలుగో మ్యాచ్ ప్లేయింగ్ ఎలెవన్‌లో టీమిండియాలో ఎలాంటి మార్పులు జరగకపోవచ్చు. బౌలింగ్ దళం విషయానికి వస్తే.. బుమ్రా జట్టును ముందుకు నడిపిస్తుండగా ఆకాష్ దీప్, సిరాజ్, నితీష్, జడ్డు రాణిస్తున్నారు. అయితే బ్యాటింగ్ విషయంలో పుంజుకోవాల్సి ఉంది. తొలి టెస్టు మ్యాచ్‌ని పక్కన పెడితే.. ఆ తర్వాత భారత బ్యాట్స్‌మెన్ పూర్తిగా ఇబ్బంది పడుతున్నట్లు కనిపించింది. కాబట్టి తదుపరి టెస్ట్ మ్యాచ్‌లో పరుగులు చేయాల్సిన బాధ్యత భారత బ్యాట్స్‌మెన్‌ల భుజాలపై ఉంది.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Border-Gavaskar Trophy
  • India vs Australia
  • Melbourne test
  • rohit sharma

Related News

IND vs SA

IND vs SA: తొలి వ‌న్డేలో భార‌త్ థ్రిల్లింగ్ విక్ట‌రీ!

భారత్ తరఫున హర్షిత్ రాణా రెండో ఓవర్‌లోనే దక్షిణాఫ్రికాకు డి కాక్, రికల్టన్ రూపంలో రెండు పెద్ద షాక్‌లు ఇచ్చాడు. వీరిద్దరూ ఖాతా తెరవలేకపోయారు.

  • IND vs SA 1st ODI

    IND vs SA 1st ODI: అద‌ర‌గొట్టిన కోహ్లీ, కేఎల్ రాహుల్‌.. సౌతాఫ్రికా ముందు భారీ ల‌క్ష్యం!

  • Most Matches

    Most Matches: రోహిత్ శ‌ర్మ- విరాట్ కోహ్లీ జోడీ.. భార‌త్ త‌ర‌పున స‌రికొత్త రికార్డు!

  • Rohit Sharma

    Rohit Sharma: ప్ర‌పంచ రికార్డు క్రియేట్ చేసిన రోహిత్ శ‌ర్మ‌!

  • Virat Kohli

    Virat Kohli: విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్‌కు మ‌ళ్లీ తిరిగి వ‌స్తాడా?!

Latest News

  • November Car Sales: న‌వంబ‌ర్ నెల‌లో ఇన్ని కార్ల‌ను కొనేశారా?

  • 8th Pay Commission: కేంద్రం నుండి ప్రభుత్వ ఉద్యోగులు ఏం కోరుతున్నారు?

  • Storm Damage : తుఫాను నష్టంపై అమిత్ షాకు లోకేష్ నివేదిక అందజేత

  • National Herald Case : సోనియా, రాహుల్ లపై కేసులు పెడితే భయపడేది లేదు – రేవంత్

  • Imran Khan: ప్రస్తుతం ఇమ్రాన్ ఖాన్ ఎక్కడ ఉన్నారు?

Trending News

    • Telangana Rising Summit: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు 3,000 మంది ప్ర‌ముఖులు?!

    • Glenn Maxwell: ఐపీఎల్‌కు స్టార్ ప్లేయ‌ర్ దూరం.. లీగ్‌కు గుడ్ బై చెప్పిన‌ట్లేనా?!

    • AP CM Chandrababu Naidu : చంద్రబాబుపై అవినీతి కేసులు కొట్టేసిన హైకోర్టు..!

    • Hardik Pandya: టీమిండియాకు గుడ్ న్యూస్‌.. ఫిట్‌గా స్టార్ ప్లేయ‌ర్‌!

    • Raj Nidimoru : సమంత రెండో భర్త రాజ్ నిడిమోరు బ్యాక్‌గ్రౌండ్ తెలుసా!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd