Dravid On Bumrah: బూమ్రా మెడికల్ రిపోర్ట్ కోసం వెయిటింగ్: ద్రావిడ్
భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బూమ్రా టీ ట్వంటీ వరల్డ్ కప్ లో ఆడతాడా లేదా...ఇప్పుడు ఇదే ఫాన్స్ ను వేధిస్తున్న ప్రశ్న. గాయంతో
- By Naresh Kumar Published Date - 11:23 PM, Sat - 1 October 22
భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బూమ్రా టీ ట్వంటీ వరల్డ్ కప్ లో ఆడతాడా లేదా…ఇప్పుడు ఇదే ఫాన్స్ ను వేధిస్తున్న ప్రశ్న. గాయంతో మెగా టోర్నీకి బూమ్రా దూరమయ్యాడనీ వార్తలు వచ్చినా…ఇప్పటి వరకూ స్పష్టత లేదు. అయితే బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ మాత్రం బూమ్రా గాయంపై స్పందించాడు. ఇంకా అతను టోర్నీ నుంచి తప్పుకోలేదంటూ దాదా చెప్పగా ఇప్పుడు కోచ్ రాహుల్ ద్రావిడ్ కూడా ఇదే విధంగా మాట్లాడాడు. సౌతాఫ్రికాతో రెండో టీ ట్వంటీ సందర్భంగా మాట్లాడిన ద్రావిడ్ బుమ్రా టీ20 ప్రపంచకప్ దూరం కాలేదని చెప్పాడు.
అతని గైర్హాజరీపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని, బుమ్రా ఫిట్నెస్కు సంబంధించిన మెడికల్ రిపోర్ట్స్ కోసం వేచి చూస్తున్నామని తెలిపాడు.బుమ్రా సౌతాఫ్రికాతో టీ20 సిరీస్కు మాత్రమే అందుబాటులో లేడనీ తెలిపాడు. నేషనల్ క్రికెట్ అకాడమీకి వెళ్లాడనీ, అక్కడ వైద్య బృందం పరిశీలించి పరిస్థితి ఏంటనేది వెల్లడిస్తుందన్నాడు. రాబోయే రెండు మూడు రోజుల్లో ఏం జరుగుతుందనే తెలియాలంటే వేచి చూడాలనీ మీడియాకు సూచించాడు.
నిపుణులు చెప్పేదానిపైనే తాను ఆధారపడతాననీ, అధికారికంగా ఇప్పటికీ అతను టీ20 ప్రపంచ కప్ నుంచి వైదొలిగినట్లు కాదన్నాడు. అనుకూలంగా నిర్ణయం వస్తుందని ఆశిస్తున్నామంటూ ద్రవిడ్ వెల్లడించాడు. గాయం కారణంగా బూమ్రా తప్పుకోవడంతో సఫారీలతో మిగిలిన రెండు మ్యాచ్ లకు బీసీసీఐ హైదరాబాదీ పేసర్ సిరాజ్ ను ఎంపిక చేసింది.
Related News
MI vs DC: ఢిల్లీని దెబ్బ కొట్టిన జస్ప్రీత్ బుమ్రా
భారీ లక్ష్యఛేదనలో తడబడుతున్న ఢిల్లీ క్యాపిటల్స్ న్నీ ఆదుకునే ప్రయత్నం చేశాడు ఢిల్లీ ఓపెనర్ పృథ్వీ షా. ఆరంభం నుంచి నిలకడగా ఆడుతూ ఢిల్లీ జట్టు స్కోరును ప్పరుగులు పెట్టించాడు. మరో పెనర్ డేవిడ్ వార్నర్ స్వల్ప స్కోరుకే పెవిలియన్ చేరడంతో జట్టు బాధ్హ్యతను పృథ్వీ షా తీసుకున్నాడు