World Cup 2023: మెగా టోర్నీకి క్యూ కట్టిన స్పాన్సర్లు
ప్రపంచ కప్ ఈ రోజుతో మొదలైంది. పది జట్లు బరిలోకి దిగుతుండగా అందులో టీమిండియా హాట్ ఫెవరెట్ జట్టుగా నిలిచింది. భారత్ తో పాటు ఆస్ట్రేలియా, పాకిస్తాన్, ఇంగ్లాండ్,
- By Praveen Aluthuru Published Date - 06:59 PM, Thu - 5 October 23

World Cup 2023: ప్రపంచ కప్ ఈ రోజుతో మొదలైంది. పది జట్లు బరిలోకి దిగుతుండగా అందులో టీమిండియా హాట్ ఫెవరెట్ జట్టుగా నిలిచింది. భారత్ తో పాటు ఆస్ట్రేలియా, పాకిస్తాన్, ఇంగ్లాండ్, న్యూజిలాండ్ జట్లున్నాయి. డిపెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్, మరియు న్యూజిలాండ్ మధ్య జరిగే మ్యాచ్ తో ప్రపంచ కప్ హాట్టహాసంగా ప్రారంభమైంది. సొంతగడ్డపై టోర్నీ జరుగుతుండటంతో స్పాన్సర్లు తమ ఉత్పతులని ప్రమోట్ చేసుకునేందుకు ఎగబడుతున్నారు. కోట్లు వెచ్చించడానికి అయినా రెడీ అంటున్నారు.
వరల్డ్ కప్ టోర్నీలో మొత్తం 48 మ్యాచ్ లు జరుగుతాయి. ఈ మ్యాచ్ లను డిస్నీప్లస్ హాట్ స్టార్ ప్రసారం చేస్తుంది. పన్నెండేళ్ల తర్వా త ప్రపంచ కప్ కు భారత్ ఆతిథ్యమిస్తుండటంతో అడ్వరైటేజర్లు తమ ప్రొడక్ట్స్ ని ప్రమోట్ చేసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇందుకోసం లక్షలు కాదు కోట్లు చెల్లించేందుకు అయినా రెడీ అంటున్నాయి. స్పాన్సర్ల జాబితాలో కోకాకోలా, ఫోన్పే, మహీంద్రా అండ్ మహీంద్రా, డ్రీమ్ లెవెన్ , హెచ్ యూఎల్, హావెల్స్, ఇండస్ఇండ్ బ్యాంక్, పెర్నాడ్ ఇండియా, బుకింగ్ డాట్ కం, పీటర్ ఇంగ్లాండ్, కింగ్ ఫిషర్ ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్, మాండెలీజ్, ఎమిరేట్స్, డయాజియో, ఎంఆర్ఎఫ్, లెండింగ్కార్ట్, బీపీసీఎల్, హెర్బాలైఫ్, హయర్, యాంఫీ, గూగుల్ పే, పాలీ క్యాబ్, అమూల్, విడా, అమెజాన్ మొదలైన సంస్థలు టీవీ, ఓటిటీ ప్లాట్ఫామ్స్ లో స్పాన్సర్ చేస్తున్నాయి.
Also Read: Chiranjeevi : చిరంజీవి న్యూ లుక్ కేక