DC vs CSK: క్రిస్ గేల్ ప్రపంచ రికార్డును సమం చేసిన వార్నర్
ఢిల్లీ ఓపెనర్ డేవిడ్ వార్నర్ టీ20 క్రికెట్‌లో అత్యధిక సార్లు ఫిఫ్టీ ప్లస్ స్కోర్లు సాధించిన క్రిస్ గేల్ ప్రపంచ రికార్డును సమం చేశాడు. ఆదివారం జరిగిన చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ లో వార్నర్ ఈ ఫీట్ సాధించాడు.
- By Praveen Aluthuru Published Date - 12:08 AM, Mon - 1 April 24

DC vs CSK: ఢిల్లీ ఓపెనర్ డేవిడ్ వార్నర్ టీ20 క్రికెట్‌లో అత్యధిక సార్లు ఫిఫ్టీ ప్లస్ స్కోర్లు సాధించిన క్రిస్ గేల్ ప్రపంచ రికార్డును సమం చేశాడు. ఆదివారం జరిగిన చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ లో వార్నర్ ఈ ఫీట్ సాధించాడు. టీ20 క్రికెట్‌లో ఇది అతనికి 110వ ఫిఫ్టీ ప్లస్ స్కోరు. వార్నర్ కేవలం 32 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించి దిగ్గజ కరీబియన్ బ్యాట్స్‌మెన్ క్రిస్ గేల్ రికార్డును సమం చేశాడు.
2024 ఐపీఎల్ 13వ మ్యాచ్‌లో డేవిడ్ వార్నర్ తొలి వికెట్‌కు పృథ్వీ షాతో కలిసి 93 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. ఇన్నింగ్స్ 9వ ఓవర్లో వార్నర్ 32 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ హాఫ్ సెంచరీ సాయంతో డేవిడ్ వార్నర్ క్రిస్ గేల్‌ను సమం చేశాడు. ఈ జాబితాలో విరాట్ కోహ్లీ మూడో స్థానంలో, బాబర్ ఆజం నాలుగో స్థానంలో నిలిచారు.
We’re now on WhatsApp. Click to Join.
ఆటగాడు – టీ20 మ్యాచ్ – స్కోరు 50 ప్లస్
డేవిడ్ వార్నర్ 373 110*
క్రిస్ గేల్ 463 110
విరాట్ కోహ్లీ 379 101
బాబర్ ఆజం 290 98
జోస్ బట్లర్ 405 86