Cricketers Apology: చిక్కుల్లో యువీ,రైనా,భజ్జీ వీడియో డిలీట్, క్షమాపణలు చెప్పిన క్రికెటర్లు
హర్భజన్ సింగ్, యువరాజ్ సింగ్, సురేష్ రైనాలపై వికలాంగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాలీవుడ్ మూవీ బ్యాడ్ న్యూస్ లోని తౌబా తౌబా హుక్ స్టెప్‌ను ఇమిటేట్ చేస్తూ రీల్ చేశారు. దీనిలో వారు ముగ్గురూ నడుము పట్టుకుని, కుంటుకుంటూ నడుస్తూ కనిపించారు. దీనిపై దివ్యాంగుల హక్కుల కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు
- By Praveen Aluthuru Published Date - 10:52 PM, Mon - 15 July 24

Cricketers Apology: వరల్డ్ ఛాంపియన్ షిప్ ఆఫ్ లెజెండ్స్ టైటిల్ గెలిచిన జోష్ లో చేసిన ఓ వీడియో మాజీ క్రికెటర్లు హర్భజన్ సింగ్, యువరాజ్ సింగ్, సురేష్ రైనాలపై ఆగ్రహానికి కారణమైంది. బాలీవుడ్ మూవీ బ్యాడ్ న్యూస్ లోని తౌబా తౌబా హుక్ స్టెప్‌ను ఇమిటేట్ చేస్తూ రీల్ చేశారు. దీనిలో వారు ముగ్గురూ నడుము పట్టుకుని, కుంటుకుంటూ నడుస్తూ కనిపించారు. దీనిపై దివ్యాంగుల హక్కుల కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది దివ్యాంగుల మనోభావాలను దెబ్బతీయడమేనని విమర్శించారు. దేశం మొత్తం హీరోలుగా భావించే వ్యక్తుల నుంచి ఇలాంటి అమర్యాదకర ప్రవర్తనను ఊహించలేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇంతకు దిగజారుతారా అంటూ ఫైర్ అయ్యారు. దివ్యాంగులను ప్రోత్సహించాల్సింది పోయి వారిని కించపరిచేలా వీడియోలు చేయడంపై మండిపడ్డారు. కాగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తడంతో సోషల్ మీడియా వేదికగా హర్భజన్ , రైనా క్షమాపణలు చెప్పారు.
ఎవ్వరినీ కించపరిచే ఉద్దేశంతో ఈ వీడియో చేయలేదని, 15 రోజులుగా టోర్నమెంట్ ఆడి అలసిపోవడంతో సరదాగా పాటను ఇమిటేట్ చేశామని వివరణ ఇచ్చారు. ఒకవేళ ఎవరైనా తమ చర్యలకు బాధపడి ఉంటే క్షమాపణ చెబుతున్నట్టు ఇన్ స్టా గ్రామ్ లో రాసుకొచ్చారు. ఆ వీడియోను కూడా సోషల్ మీడియా నుంచి డిలీట్ చేశారు. ఈ విషయాన్ని ఇక్కడితో వదలేయాలని కోరారు. తాము అందరినీ ప్రేమిస్తామని, ఎవ్వరినీ అవమానించే ఉద్దేశం లేదంటూ ఇన్ స్టా గ్రామ్ పోస్టులో రాసుకొచ్చారు. మరోవైపు యువరాజ్ , రైనా, హర్భజన్ లపై ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు వచ్చింది. వికలాంగులను వీరు అవహేళన చేశారంటూ నేషనల్ సెంటరన్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఎంప్లాయిమెంట్ ఫర్ డిసేబుల్డ్ పీపుల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అర్మాన్ అలీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై బీసీసీఐ చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ చేశారు.
Also Read: Samantha : ఎల్లి కవర్ పేజ్ పై సమంత హంగామా..!