T20 South Africa vs India : శాంసన్, తిలక్ ఊచకోత.. భారత్ భారీ స్కోర్
T20 South Africa vs India : జొహానెస్‌బర్గ్ వేదికగా నాలుగో టీ20లో టీమ్ ఇండియా బ్యాట్స్మెన్స్ దుమ్ముదులిపారు. దక్షిణాఫ్రికాపై టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీం ఇండియా.. ప్రత్యర్థి జట్టు బౌలర్లను చెడుగుడు ఆడుకున్నారు
- By Sudheer Published Date - 11:08 PM, Fri - 15 November 24

T20 South Africa vs India : చివరి టీ20లో సౌతాఫ్రికా బౌలర్లను భారత బ్యాటర్లు ఊచకోత కోశారు. శాంసన్ (Samson) (109*), తిలక్ వర్మ (Tilak Varma)(120*) సెంచరీల మోత మోగించారు. జొహానెస్‌బర్గ్ వేదికగా నాలుగో టీ20లో టీమ్ ఇండియా బ్యాట్స్మెన్స్ దుమ్ముదులిపారు. దక్షిణాఫ్రికా (South Africa)పై టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీం ఇండియా.. ప్రత్యర్థి జట్టు బౌలర్లను చెడుగుడు ఆడుకున్నారు. నిర్ణీత 20 ఓవర్లలో వికెట్ కోల్పోయి 283 పరుగులు చేసింది. బ్యాటర్లలో సంజూ శాంసన్, తిలక్ వర్మ దక్షిణాఫ్రికా బౌలర్లకు చుక్కలు చూపించారు. మ్యాచ్లో మొత్తం 23 సిక్సర్లు బాది..అభిమానులకు పండగ వాతావరణం తీసుకొచ్చారు. మరో ఓపెనర్ అభిషేక్ శర్మ 36 రన్స్ తో రాణించారు.
ఇక తిలక్ వర్మ (Tilak Varma) వరుసగా టీ20ల్లో రెండో సెంచరీ చేయడం విశేషం. ఈ 4వ టీ20లో కేవలం 41 బంతుల్లోనే సెంచరీ కొట్టారు. 9 సిక్సర్లు, 6 ఫోర్లతో సఫారీ బౌలర్లపై విరుచుకుపడ్డారు. అయితే అతడిచ్చిన 3-4 క్యాచ్లను ఫీల్డర్లు వదిలేయడం తి’లక్’కు కలిసొచ్చింది. కాగా 3వ టీ20లోనూ తిలక్ సెంచరీ చేసిన విషయం తెలిసిందే. అలాగే టీమ్ ఇండియా వికెట్ కీపర్ సంజూ శాంసన్ సూపర్ (100*)సెంచరీతో మెరిశారు. 51 బంతుల్లోనే 6 ఫోర్లు, 8 సిక్సర్లతో 100 పరుగులు పూర్తి చేసాడు. ఇన్నింగ్స్ తొలి బంతి నుంచే సంజూ ఫోర్లు, సిక్సర్లతో ప్రొటీస్ బౌలర్లపై విరుచుకుపడ్డారు. ఈ సిరీస్లో సంజూకిది రెండో సెంచరీ. సంజూ శాంసన్ కొట్టిన ఓ భారీ సిక్సర్‌తో గ్యాలరీలో ఉన్న ఓ మహిళా అభిమానికి గాయమైంది. శాంసన్ సిక్సర్ ధాటికి ఓ లేడీ ఫ్యాన్ దవడ పగిలింది! ఆమెకు నొప్పితో విలవిలలాడింది. ఐస్ ప్యాక్ పెట్టుకుని కన్నీటి పర్యంతమైంది. ఈ వీడియోస్ సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.
Read Also : Maharashtra Election Campaign : మహారాష్ట్రలో ఇద్దరు తెలుగు సీఎంల ప్రచారం..ఇక తగ్గేదేలే