Dhoni Angry: దిమాక్ ఖరాబ్ అయ్యిందా..ముకేశ్ పై ధోనీ సీరియస్
ఎంస్ ధోనీని...మిస్టర్ కెప్టెన్ కూల్ అంటుంటారు. ఎంత ఒత్తిడి ఉన్నా సరే...కొంచెం కూడా పైకి కనిపించనివ్వరు.
- Author : Hashtag U
Date : 02-05-2022 - 12:07 IST
Published By : Hashtagu Telugu Desk
ఎంఎస్ ధోనీని…మిస్టర్ కెప్టెన్ కూల్ అంటుంటారు. ఎంత ఒత్తిడి ఉన్నా సరే…కొంచెం కూడా పైకి కనిపించనివ్వరు. కూల్ గా జట్టును సక్సెస్ వైపు తీసుకుపోవడంలో ఆయన అంత గ్రేట్ క్రికెటర్ భారత క్రికెట్ లో మరొకరు లేరని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అటువంటిది ఆదివారం సన్ రైజర్స్ తో మ్యాచ్ సందర్భంగా ధోనీలో కోపం కనిపించింది. లాస్ట్ ఓవర్ బౌలింగ్ ను ధోనీ…ముకేశ్ చౌదరికి అప్పగించాడు. సన్ రైజర్స్ విజయానికి 36 పరుగులు కావాల్సి ఉంది.
ఈ సమయంలో ఎంతో జాగ్రత్తగా బౌలింగ్ చేయాలని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కానీ ముకేశ్ బౌలింగ్ లో పూరన్ 6,4,6,6 పరుగులు చేస్తూ చెలరేగిపోయాడు. అయినా కూడా ధోనీ ఏమాత్రం సహనాన్ని కోల్పోలేదు. కానీ ఒక బాల్ కూడా కీలకంగా మారిన సమయంలో ముకేశ్ చౌదరి వైడ్ బాల్ వేసాడు. దీంతో ధోనీ ఆగ్రహంతో మైండ్ పెట్టుకుని బౌలింగ్ చేయి అన్నట్లుగా వేలును తలపై పెట్టుకుని సైగలు చేశాడు. మైదానంలో బోర్డుపై ఎన్ని బంతులకు ఎన్ని పరుగులు కావాలన్న గణాంకాలను చూపిస్తూ…జాగ్రత్తగా బౌలింగ్ చేయాలని సీరియస్ గా సూచించాడు ధోనీ.
MS angry at Mukesh in the final over! I mean who wouldn’t be😃🙏#CSKvSRH #IPL2022 pic.twitter.com/RGShsHcs9O
— Navya (@SweptForASix) May 1, 2022