IPL 2023: చిన్నారి సాహసం.. వామికను డేట్ కి తీసుకెళ్లొచ్చా అంటూ విరాట్ కోహ్లీకి ప్లకార్డు?
ప్రస్తుతం ఐపీఎల్ 2023 సీజన్ నడుస్తున్న విషయం తెలిసిందే. మ్యాచ్ లు హోరాహోరీగా జరుగుతున్నాయి. ఇది ఇలా
- By Nakshatra Published Date - 07:30 PM, Tue - 18 April 23
ప్రస్తుతం ఐపీఎల్ 2023 సీజన్ నడుస్తున్న విషయం తెలిసిందే. మ్యాచ్ లు హోరాహోరీగా జరుగుతున్నాయి. ఇది ఇలా ఉంటే తాజాగా చెన్నై ఆర్సిబి జట్ల మధ్య మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే చిన్నస్వామి స్టేడియంలో ఒక ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. స్టాండ్స్ లో ఒక పిల్లవాడు నిల్చుని.. హాయ్ విరాట్ అంకుల్.. వామికను డేట్ కి తీసుకెళ్లొచ్చా.. అని రాసి ఉన్న ప్లకార్డును చేతిలో పట్టుకుని కనిపించాడు. సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విరాట్ కోహ్లీ అభిమానులు అలాగే నేటిజన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అభం శుభం తెలియని ఆ చిన్నారితో అటువంటి ప్లకార్డుని చేత పట్టుకోమని ఇచ్చిన ఆ తల్లిదండ్రులకు బుద్ధి లేదా అంటూ మండిపడుతున్నారు. అందులో ఆ పిల్లవాడు ఎటువంటి తప్పులేదు అందులో ఏమి రాసి ఉందో కూడా ఆ పిల్లవాడికి తెలియదు. అంత ఆ పిల్లవాడు తల్లిదండ్రుల తప్పే అంటూ మండి పడుతున్నారు. కొందరు ఆ ఫోటో పై స్పందిస్తూ కొంతమంది ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించడం కోసం ఇలాంటి చిల్లర పనులు చేస్తుంటారు అని కామెంట్స్ చేశారు. ఎక్కువ శాతం మంది ఆ చిన్నారి తల్లిదండ్రులపై మండిపడుతున్నారు.
కొందరు వల్గర్ గా కామెంట్స్ చేస్తూ విరుచుకు పడుతున్నారు. టీమిండియా స్టార్ క్రికెటర్ అయిన విరాట్ కోహ్లీ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మ ముద్దుల కూతురు వామిక అన్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఇప్పటివరకు ఈ పాపకు సంబంధించిన ఫోటోలు ఒకటి కూడా బయటకు లీక్ కాకుండా విరాట్ దంపతులు జాగ్రత్త పడుతున్నారు. ఆ పాపను చూడడం కోసం అభిమానులు ఎంతో అద్భుతంగా ఎదురు చూస్తున్నప్పటికీ పాపకు సంబంధించిన విషయాలను వెల్లడించడం ఇష్టం లేదని విరాట్ కోహ్లీ దంపతులు ఇప్పటికే తెలిపిన విషయం తెలిసిందే.
Related News
Virat Kohli Record: T20 ప్రపంచ కప్ గేమ్‌ల్లో కోహ్లీ రికార్డులు ఇవే.. లెక్కలు చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే..!
కొద్ది రోజుల క్రితం విరాట్ కోహ్లీ స్లో స్ట్రైక్ రేట్‌తో ఆడుతున్నాడని ట్రోల్ చేశారు. ఇటీవల 67 బంతుల్లోనే సెంచరీ చేసి ఐపీఎల్ చరిత్రలో అత్యంత స్లో సెంచరీ సాధించిన ఘనత కోహ్లిదే.