Bumrah vs Konstas: సామ్ కొన్‌స్టాస్ కి బుద్ది చెప్పిన జస్ప్రీత్ బుమ్రా
ఈ మ్యాచ్‌లో మరోసారి భారత బ్యాటింగ్ విఫలమైంది. రిషబ్ పంత్ అత్యధికంగా 40 పరుగులు చేశాడు. పంత్ 98 బంతులు ఎదుర్కొని మూడు ఫోర్లు, ఒక సిక్సర్ బాదాడు.
- By Naresh Kumar Published Date - 11:40 PM, Fri - 3 January 25

Bumrah vs Konstas: బాక్సింగ్ డే టెస్ట్ తొలిరోజు కోహ్లీ-సామ్ కొన్‌స్టాస్ వివాదం తెలిసిందే. సామ్ కొన్‌స్టాస్ (Bumrah vs Konstas) విషయంలో కోహ్లీ ఫిజికల్ గా స్లెడ్జ్ చేయడం కాస్త ఇబ్బందిగా అనిపించింది. దీంతో ఆస్ట్రేలియన్ మీడియా కోహ్లీని తీవ్ర పదజాలంతో దూషించింది. అయితే ఈ రోజు సామ్ కొన్‌స్టాస్ బుమ్రా విషయంలో కాస్త ఓవరాక్షన్ చేశాడు. కేవలం 19 ఏళ్ళ వయసులో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన సామ్ కొన్‌స్టాస్, సీనియర్ల విషయంలో కాస్త తగ్గి ఉండాల్సిన అవసరం ఉందంటున్నారు మాజీలు.
మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో జస్ప్రీత్ బుమ్రా మరియు యశస్వి జైస్వాల్ విషయంలో సామ్ కొన్‌స్టాస్ ఓవర్ గా ప్రవర్తించాడు. తాజాగా సిడ్నీ వేదికగా ప్రారంభమైన ఐదో టెస్టు మ్యాచ్‌లో కూడా సామ్ కొన్‌స్టాస్ తన చేష్టలతో బుమ్రాకు కోపం తెప్పించాడు. ఈ మ్యాచ్‌లో కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న బుమ్రా ఆరంభంలోనే ఉస్మాన్ ఖవాజా వికెట్ తీశాడు. దీంతో తొలి రోజు ఆట ముగిసింది. దీంతో సామ్ కొన్‌స్టాస్ ముఖం వాలిపోయింది. ఎందుకంటే ఈ వికెట్ కి ముందు సామ్ బుమ్రా విషయంలో కాస్త దూకుడుగా ప్రవర్తించాడు. ఖవాజా బ్యాటింగ్ చేస్తుండగా బుమ్రా బౌలింగ్ కి రెడీ అయిన క్రమంలో అంపైర్ బౌలింగ్ కి అడ్డుపడ్డాడు. అప్పుడు బుమ్రా ఎందుకు అన్నట్టుగా లుక్ ఇచ్చాడు. దీంతో సామ్ కొన్‌స్టాస్ బుమ్రాతో వివాదానికి దిగాడు. దీంతో బుమ్రా సీరియస్ గా సామ్ వైపు వెళ్తుండగా ఇంతలో అంపైర్ జోక్యం చేసుకోవడంతో ఇద్దరూ తమ తమ స్థానాలకు వెళ్లిపోయారు. అయితే ఆ నెక్స్ట్ బంతికే బుమ్రా ఖవాజాని అవుట్ చేశాడు. దీంతో వికెట్ తీసిన ఆనందంలో బుమ్రా సంబరాలు చేసుకుంటూ సామ్ కొన్‌స్టాస్ వైపు చూశాడు. సామ్ కొన్‌స్టాస్ తల దించుకుని స్టాండ్స్ వైపుకు వెళ్ళాడు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా ఒక వికెట్ కోల్పోయి 9 పరుగులు చేసింది. అంతకుముందు టీమిండియా 10 వికెట్లు కోల్పోయి 185 పరుగులకే కుప్పకూలింది.
Fiery scenes in the final over at the SCG!
How's that for a finish to Day One 👀#AUSvIND pic.twitter.com/BAAjrFKvnQ
— cricket.com.au (@cricketcomau) January 3, 2025
ఈ మ్యాచ్‌లో మరోసారి భారత బ్యాటింగ్ విఫలమైంది. రిషబ్ పంత్ అత్యధికంగా 40 పరుగులు చేశాడు. పంత్ 98 బంతులు ఎదుర్కొని మూడు ఫోర్లు, ఒక సిక్సర్ బాదాడు. పంత్ తర్వాత అత్యధిక స్కోరు చేసిన ఆటగాడిగా రవీంద్ర జడేజా నిలిచాడు. అతను 26 పరుగులు చేశాడు. విరాట్ కోహ్లి 17 పరుగుల వద్ద, శుభ్‌మన్ గిల్ 20 పరుగుల వద్ద ఔటయ్యారు. ఆస్ట్రేలియా తరఫున స్కాట్ బోలాండ్ నాలుగు వికెట్లు పడగొట్టాడు. మిచెల్ స్టార్క్ మూడు వికెట్లు సాధించాడు. పాట్ కమిన్స్ రెండు వికెట్లు తీశాడు.