HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >Bumrah Returns From Injury Included In Odi Squad For Sl Series

Bumrah: లంకతో వన్డేలకు బూమ్రా

టీమిండియా ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. భారత స్పీడ్‌స్టర్ జస్ప్రీత్ బూమ్రా గాయం నుంచి కోలుకున్నాడు. శ్రీలంకతో వన్డే సిరీస్‌లో బూమ్రా రీఎంట్రీ ఇవ్వబోతున్నాడు.

  • Author : Naresh Kumar Date : 03-01-2023 - 11:04 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Bumrah On Fire
Bumrah On Fire

టీమిండియా ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. భారత స్పీడ్‌స్టర్ జస్ప్రీత్ బూమ్రా గాయం నుంచి కోలుకున్నాడు. శ్రీలంకతో వన్డే సిరీస్‌లో బూమ్రా రీఎంట్రీ ఇవ్వబోతున్నాడు. లంకతో సిరీస్‌ కోసం బూమ్రాను ఎంపిక చేసినట్టు బీసీసీఐ ప్రకటించింది. బూమ్రా ఫిట్‌నెస్ టెస్ట్ పాసవడంతో అతన్ని జట్టులోకి తీసుకున్నామని తెలిపింది. బూమ్రా టీమిండియాకు దూరమై దాదాపు 6 నెలలు దాటిపోయింది. గాయంతో స్వదేశంలో గత ఏడాది సౌతాఫ్రికా సిరీస్‌ నుంచి వైదొలిగిన ఈ స్టార్ పేసర్ తర్వాత ఆసియాకప్‌, టీ ట్వంటీ ప్రపంచకప్‌లకూ దూరమయ్యాడు. గాయం నుంచి పూర్తి స్థాయిలో కోలుకోకపోవడంతో తప్పుకోవాల్సి వచ్చింది. బూమ్రా లేకపోవడంతో ప్రపంచకప్‌లో భారత్ విజయావకాశాలను దెబ్బతీసింది. డెత్ ఓవర్లలో అద్భుతంగా బౌలింగ్ చేసే ఈ స్టార్ పేసర్ సేవలను కోల్పోయిన టీమిండియా సెమీస్‌లో నిష్క్రమించింది. అప్పటి నుంచీ చికిత్స తీసుకుంటున్న బూమ్రా గత నెలలో జాతీయ క్రికెట్ అకాడమిలో ప్రాక్టీస్ మొదలుపెట్టాడు.

అంతకుముందు జరిగిన కొన్ని అనుభవాల నేపథ్యంలో బీసీసీఐ వెంటనే బూమ్రాను జట్టులోకి తీసుకోలేదు. జాతీయ క్రికెట్ అకాడమీలో ఫిట్‌నెస్ టెస్ట్ ముగిసిన తర్వాతే పాజిటివ్ రిజల్ట్ ఉంటే జట్టులోకి తీసుకోవాలని నిర్ణయించింది. అందుకే కొత్త ఏడాదిలో లంకతో సిరీస్‌కు బూమ్రా ఎంపికపై సస్పెన్స్ నెలకొంది. ఇప్పుడు ఫిట్‌నెస్ సాధించడంతో బూమ్రాను వన్డే సిరీస్‌కు ఎంపిక చేసింది. బూమ్రా ఎంట్రీతో భారత పేస్ బలం మరింత బలపడనుంది. బూమ్రాతో పాటు మహ్మద్ షమీ, సిరాజ్, ఉమ్రాన్ మాలిక్, అర్షదీప్‌సింగ్‌ పేస్ భారాన్ని మోయనున్నారు. రోహిత్‌ శర్మ కెప్టెన్సీలో భారత్ మూడు వన్డే సిరీస్‌ జనవరి 10 నుంచి ఆడనుంది.

శ్రీలంకతో వన్డేలకు టీమిండియా ః
రోహిత్‌ శర్మ, శుభ్‌మన్‌ గిల్‌, విరాట్‌ కోహ్లి, సూర్యకుమార్‌ యాదవ్‌, శ్రేయస్‌ అయ్యర్‌, కేఎల్ రాహుల్‌, ఇషాన్‌ కిషన్‌, హార్దిక్‌ పాండ్యా, వాషింగ్టన్‌ సుందర్‌, యుజువేంద్ర చహల్‌, కుల్దీప్‌ యాదవ్‌, అక్షర్‌ పటేల్‌, జస్‌ప్రీత్‌ బుమ్రా, మహ్మద్‌ షమి, మహ్మద్‌ సిరాజ్‌, ఉమ్రాన్ మాలిక్, అర్ష్‌దీప్‌ సింగ్‌


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • india vs srilanka
  • Jasprit Bumrah
  • team india

Related News

Womens T20 World Cup

మహిళల టీ20 వరల్డ్ కప్‌.. ప్రైజ్ మ‌నీ ఎంతంటే?

జూన్ 12 నుండి ప్రారంభం కానున్న మహిళల టీ20 వరల్డ్ కప్ కోసం ఐసీసీ 82.64 కోట్ల రూపాయల బహుమతి మొత్తాన్ని ప్రకటించింది.

    Latest News

    • ఐసీయూలో మాజీ క్రికెటర్.. ప్రాణాంతక వ్యాధితో పోరాటం!

    • పాత ఉద్యోగం పోయె.. కొత్త ఆఫర్ వెనక్కి తీసుకెళ్లె! సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఆవేదన

    • యాపిల్ కొత్త సీఈఓగా జాన్ టెర్నస్.. ఎవ‌రీత‌ను?

    • చమురు సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి భారత్ మాస్టర్ ప్లాన్!

    • Allu Arjun : ముంబైకి మకాం మార్చబోతున్న అల్లు అర్జున్ ?

    Trending News

      • మారుతున్న శాలరీ స్ట్రక్చర్.. ఎవరికి లాభం? ఎవరికి నష్టం?

      • రేపు బ్యాంకుల‌కు సెల‌వు ఉందా?

      • వేసవిలో ఏసీలు ఎందుకు పేలుతాయి?

      • అమెరికా-ఇరాన్ చర్చలకు నో చెప్పిన టెహ్రాన్‌.. ఇస్లామాబాద్‌లో మాత్రం లాక్‌డౌన్!

      • రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి పెరగనున్న కష్టాలు!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd