HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >Bumrah Likely To Be Rested Against Bangladesh India One Win Away From Final

Bumrah:బంగ్లాపై బుమ్రాకు రెస్ట్? ఫైనల్‌కు అడుగే దూరంలో టీమిండియా

బలాబలాల పరంగా చూస్తే బంగ్లాదేశ్‌ను ఓడించడం టీమిండియాకు పెద్ద సవాలుకాదు. టోర్నీ ఆరంభం నుంచే భారత్ అన్ని జట్లపై ఆధిపత్యం కనబరిచింది.

  • By Dinesh Akula Published Date - 10:39 PM, Tue - 23 September 25
  • daily-hunt
Jaspreet Bumrah
Jaspreet Bumrah

దుబాయ్: (Asia Cup 2025) ఆసియా కప్‌లో వరుస విజయాలతో దూసుకెళ్తున్న టీమిండియా… ఫైనల్‌కు కేవలం ఒక విజయ దూరంలో నిలిచింది. సూపర్-4 తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై ఘనవిజయం సాధించిన భారత్, గురువారం బంగ్లాదేశ్‌తో తలపడనుంది. బంగ్లాపై విజయం సాధిస్తే ఫైనల్ టికెట్‌ను దక్కించుకోనుంది.

బలాబలాల పరంగా చూస్తే బంగ్లాదేశ్‌ను ఓడించడం టీమిండియాకు పెద్ద సవాలుకాదు. టోర్నీ ఆరంభం నుంచే భారత్ అన్ని జట్లపై ఆధిపత్యం కనబరిచింది. ఒమన్‌తో తప్ప ఇతర మ్యాచ్‌లన్నీ వన్‌సైడ్‌గా ముగిశాయి. ఓపెనర్లు అభిషేక్ శర్మ, శుభమన్ గిల్‌ ఫామ్‌లో ఉండటంతో భారత్‌కి హమ్ బోల్డ్ ఆరంభాలు లభిస్తున్నాయి. పాక్‌తో మ్యాచ్లో గిల్ రన్‌ఫ్లోకి రావడంతో మరింత ధీమాగా ఉంది.

ఇదిలా ఉండగా, స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఫామ్పై మాత్రం సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పాకిస్థాన్‌పై మ్యాచ్‌లో బుమ్రా ఒక్క వికెట్ కూడా తీయలేకపోయి, ఎక్కువ పరుగులు ఇచ్చాడు. ఇప్పటివరకు టోర్నీలో 3 మ్యాచ్‌ల్లో కేవలం 3 వికెట్లే తీశాడు. దీంతో బంగ్లాతో మ్యాచ్‌లో బుమ్రాకు వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్ కింద విశ్రాంతినిచ్చే అవకాశం ఉంది. అతని స్థానంలో అర్షదీప్ సింగ్ ఆడే అవకాశం కనిపిస్తోంది.

బౌలింగ్ విభాగంలో స్పిన్నర్లుగా కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి కొనసాగనున్నారు. బ్యాటింగ్‌లో సంజూ శాంసన్ స్థానంలో జితేశ్ శర్మకు అవకాశం ఇవ్వొచ్చని టాక్.

ఇక బంగ్లాదేశ్ జట్టును తక్కువ అంచనా వేయడం కరెక్ట్ కాదు. సూపర్-4లో శ్రీలంకపై గెలిచిన ఆ జట్టు సర్‌ప్రైజ్ ఇవ్వగలదు. అయితే కెప్టెన్ లిట్టన్ దాస్ వెన్నునొప్పితో ఇబ్బంది పడుతున్నాడు. మ్యాచ్ సమయానికి ఆయన లేకపోతే బంగ్లాకు కొంత మైనస్ అవుతుంది.

దుబాయ్ పిచ్ విషయానికొస్తే, ఇక్కడ ఛేజింగ్ జట్లు ఎక్కువగా గెలుస్తున్నాయి. టాస్ మరోసారి కీలక పాత్ర పోషించనుంది.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Asia Cup latest updates
  • Bumrah news
  • Bumrah out Arshdeep in
  • Bumrah rest reason
  • Dubai pitch report Asia Cup
  • Gill Abhishek opening
  • India final qualification
  • India vs Bangladesh preview
  • Playing XI India changes
  • Team India Asia Cup 2025

Related News

    Latest News

    • Modi Photo: మోదీపై మార్ఫింగ్ ఫోటో.. కాంగ్రెస్ నేతకు బీజేపీ కార్యకర్తల చేతిలో అవమానం!

    • Pawan Kalyan: వైరల్ జ్వరంతో బాధపడుతున్న పవన్ కల్యాణ్ — వైద్యుల సూచనలతో విశ్రాంతి

    • Bumrah:బంగ్లాపై బుమ్రాకు రెస్ట్? ఫైనల్‌కు అడుగే దూరంలో టీమిండియా

    • AP Thunderstorm: ఉత్తరాంధ్రకు భారీ వర్షాలు, పిడుగుల ముప్పు – రెడ్ అలెర్ట్ జారీ

    • GST Reforms: జీఎస్టీ 2.0.. మొద‌టిరోజు అమ్మ‌కాలు ఏ రేంజ్‌లో జ‌రిగాయంటే?

    Trending News

      • Cash: ఇంట్లో ఎంత న‌గ‌దు ఉంచుకుంటే మంచిది?

      • GST 2.0: ఇక‌పై అత్యంత త‌క్కువ ధ‌ర‌కే ల‌భించే వ‌స్తువులీవే!

      • Kantara Chapter 1 Trailer: కాంతారా చాప్ట‌ర్-1 ట్రైల‌ర్ విడుద‌ల‌.. అద‌ర‌గొట్టిన రిషబ్‌ శెట్టి!

      • Dussehra: ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ దసరా అలంకారాల వైభవం 11 రోజులు

      • EPFO 3.0: దీపావ‌ళికి ముందే శుభ‌వార్త‌.. పీఎఫ్ ఉపసంహరణ ఇక సులభతరం!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd