Bengaluru Stampede : BCCI కొత్త రూల్స్
Bengaluru Stampede : IPL ట్రోఫీ విజేతలు జరిపే విజయోత్సవాలపై కొత్త నిబంధనలు విడుదల చేసింది. ఇకపై ఈ సెలబ్రేషన్లకు ముందస్తు అనుమతులు తప్పనిసరి చేస్తూ BCCI స్పష్టమైన మార్గదర్శకాలు విడుదల చేసింది.
- By Sudheer Published Date - 01:33 PM, Mon - 23 June 25

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) ముగిసిన అనంతరం బెంగళూరులో జరిగిన తొక్కిసలాట ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ ఘటన నేపథ్యంలో భవిష్యత్తులో ఇటువంటి పరిస్థితులు మళ్లీ చోటుచేసుకోకుండా చర్యలు తీసుకోవాలని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (BCCI) కసరత్తు ప్రారంభించింది. ఫలితంగా IPL ట్రోఫీ విజేతలు జరిపే విజయోత్సవాలపై కొత్త నిబంధనలు విడుదల చేసింది. ఇకపై ఈ సెలబ్రేషన్లకు ముందస్తు అనుమతులు తప్పనిసరి చేస్తూ BCCI స్పష్టమైన మార్గదర్శకాలు విడుదల చేసింది.
Pete Hegseth: ఇరాన్ తో యుద్ధం చేయం.. అవే మా టార్గెట్.. అమెరికా క్లారిటీ
కొత్తగా తీసుకున్న నిర్ణయాల ప్రకారం.. టైటిల్ గెలిచిన వెంటనే కాకుండా కనీసం 3–4 రోజుల తర్వాతే సెలబ్రేషన్లు జరగాలి. ఈవెంట్ నిర్వహణకు ముందు బోర్డు అనుమతిని తప్పనిసరిగా పొందాలని తెలిపింది. అంతేకాదు వేడుకలు జరిగే ప్రదేశానికి జిల్లా అధికారులు, పోలీసులు మరియు సంబంధిత విభాగాల నుంచి పూర్తి అనుమతి తీసుకోవాలని పేర్కొంది. ఈ కార్యక్రమానికి నాలుగు అంచెల భద్రత కల్పించాల్సిందిగా స్పష్టం చేసింది. తద్వారా ప్రేక్షకుల రద్దీ, భద్రతా లోపాల వల్ల ప్రమాదాలు సంభవించకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చు.
YSRCP Yuvatha Poru : రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న వైస్సార్సీపీ ‘యువత పోరు’
ఇది కేవలం ఈవెంట్ వేదికకు మాత్రమే కాకుండా, ఎయిర్‌పోర్ట్ నుంచి కార్యక్రమ స్థలానికి వెళ్లే దారిలో కూడా భద్రత కల్పించాల్సిందిగా BCCI సూచించింది. ఈ మార్గదర్శకాలు IPL విజేతలే కాకుండా, రాష్ట్ర క్రికెట్ సంఘాలు కూడా పాటించాల్సినవి. ఈ నిర్ణయాలు భవిష్యత్తులో ఆటగాళ్లు, అభిమానుల భద్రతను దృష్టిలో ఉంచుకొని తీసుకున్నవని BCCI స్పష్టం చేసింది. ఈ చర్యల ద్వారా ఆటతో పాటు అభిమానుల రక్షణకూ BCCI ప్రాధాన్యం ఇస్తున్నట్లు వెల్లడైంది.