WIPL 2023: మార్చి లేదా సెప్టెంబర్‌లో మహిళల ఐపీఎల్ ?
భారత మహిళల క్రికెట్లో సరికొత్త అధ్యాయం దిశగా బీసీసీఐ సన్నద్ధమవుతోంది.
- By Naresh Kumar Published Date - 09:11 PM, Thu - 2 June 22
భారత మహిళల క్రికెట్లో సరికొత్త అధ్యాయం దిశగా బీసీసీఐ సన్నద్ధమవుతోంది. మహిళా క్రికెటర్లు, అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వుమెన్స్ ఐపీఎల్‌కు ముహూర్తం దాదాపుగా ఖరారైంది. పురుషుల ఐపీఎల్ తరహాలోనే వచ్చే ఏడాది నుంచి మహిళల ఐపీఎల్ మొదలు కానుంది. దీనికి సంబంధించి బీసీసీఐ సన్నాహాలు ప్రారంభించింది. వచ్చే ఏడాది మార్చి లేదా సెప్టెంబర్‌లో వుమెన్స్ ఐపీఎల్ నిర్వహించాలని బీసీసీఐ భావిస్తోంది.
ఈ లీగ్‌లో ఆరు జట్లు పాల్గొనబోతున్నాయి. గత కొన్ని సీజన్లుగా పురుషుల ఐపీఎల్ జరుగుతుండగానే మహిళల టీ ట్వంటీ ఛాలెంజర్ పేరుతో వుమెన్ క్రికెట్ టీమ్స్‌తో టోర్నీ నిర్వహిస్తోంది. దీని స్థానంలోనే పూర్తి స్థాయి మహిళల ఐపీఎల్ నిర్వహించాలని బీసీసీఐ ఇప్పటికే నిర్ణయించింది. మహిళల వన్డే వరల్డ్‌కప్, టీ ట్వంటీ ప్రపంచకప్‌లకు మంచి వ్యూయర్షిప్ లభించిన నేపథ్యంలో బీసీసీఐ మహిళల ఐపీఎల్ వైపు మొగ్గుచూపింది. ఇటీవల గవర్నింగ్ కౌన్సిల్ మీటింగ్‌లో చర్చించిన బీసీసీఐ ఐపీఎల్ ఫైనల్ సమయంలోనూ దీనిపై సుదీర్ఘంగా చర్చించింది. అయితే లీగ్‌కు సంబంధించి మార్చి లేదా సెప్టెంబర్ విండో ఖరారు చేసేందుకు పలు బోర్డులతో చర్చించాల్సి ఉంటుంది. అలాగే ఐసీసీ అనుమతి కూడా తీసుకోవాల్సి ఉంటుంది.
అటు సెప్టెంబర్‌లో మహిళల బిగ్‌బాష్ లీగ్ జరుగుతున్న నేపథ్యంలో వుమెన్స్ ఐపీఎల్ ఎంతవరకూ సాధ్యపడుతుందనేది తెలియాల్సి ఉంది. వచ్చే ఏడాది నిర్వహించడం ఖాయమైనప్పటకీ.. ఐసీసీ అనుమతితో పాటు ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, విండీస్ క్రికెట్ బోర్డులతో చర్చించాల్సి ఉంది. ఆయా దేశాలకు చెందిన మహిళా క్రికెటర్లు అందుబాటులో ఉండడం కూడా కీలకం కావడంతో ఆ బోర్డులు సానుకూలంగా స్పందించాల్సి ఉంటుంది. వీటితో పాటు స్టేక్హోల్డర్స్గా ఉండే వారి అభిప్రాయాలనూ పరిగణలోకి తీసుకుని షెడ్యూల్ రూపొందించాలి. అయితే దాదాపు అన్ని దేశాల బోర్డులతో సత్సంబంధాలు కలిగిన బీసీసీఐ ఇవేమీ పెద్ద అడ్డంకి కాకపోవచ్చని భావిస్తున్నారు.
కాగా, ఐపీఎల్ తర్వాత ప్రారంభమైన బిగ్ బాష్ లీగ్, కరీబియన్ ప్రీమియర్ లీగ్‌లలో గతంలోనే మహిళల టోర్నీలు మొదలయ్యాయి. ఈ టోర్నీలకు పురుషుల టోర్నీలతో సమానంగా ఆదరణ లభిస్తుంది. స్మృతి మంధాన, హర్మన్‌ప్రీత్ కౌర్, షెఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ వంటి భారత ప్లేయర్లు బీబీఎల్‌లో అదరగొట్టారు.
Tags
Related News
ICC Bans Devon Thomas: ఐసీసీ కఠిన చర్యలు.. వెస్టిండీస్ స్టార్ క్రికెటర్‌పై ఐదేళ్ల నిషేధం
వెస్టిండీస్ క్రికెటర్ డెవాన్ థామస్‌పై ఐసీసీ ఐదేళ్ల నిషేధం విధించింది. ఈ 34 ఏళ్ల వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ ఇకపై ఎలాంటి క్రికెట్‌ను ఆడలేడు.