HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >Australia Brace For Southafrica Challenge In Womens T20 World Cup Final In Quest For Record 6th Title

T20 World up Finals: కౌన్ బనేగా ఛాంపియన్… నేడే టీ ట్వంటీ వరల్డ్ కప్ ఫైనల్

మహిళల టీ ట్వంటీ క్రికెట్‌లో వరల్డ్ ఛాంపియన్ ఎవరో ఇవాళ తేలిపోనుంది. అంచనాలకు తగ్గట్టే ఫైనల్ చేరిన ఆస్ట్రేలియా ఒకవైపు..

  • By Naresh Kumar Published Date - 11:14 AM, Sun - 26 February 23
  • daily-hunt
Women’s T20 World Cup Final
Women’s T20 World Cup Final

Women’s T20 World Cup Final : మహిళల టీ ట్వంటీ క్రికెట్‌లో వరల్డ్ ఛాంపియన్ ఎవరో ఇవాళ తేలిపోనుంది. అంచనాలకు తగ్గట్టే ఫైనల్ చేరిన ఆస్ట్రేలియా ఒకవైపు.. తొలిసారి టైటిల్ పోరుకు అర్హత సాధించిన సౌతాఫ్రికా మరోవైపు కప్ కొట్టేందుకు సై అంటున్నాయి. ప్రస్తుత ఫామ్, గత రికార్డుల పరంగా ఆసీస్‌నే ఫేవరెట్‌గా భావిస్తున్నారు. అయితే సొంతగడ్డపై సత్తా చాటుతున్న సఫారీలను తేలిగ్గా తీసుకోలేం. పురుషుల క్రికెట్‌లో కూడా సౌతాఫ్రికాకు ఫైనల్ చేరిన చరిత్ర లేదు. దీంతో మహిళల టీట్వంటీ ప్రపంచకప్‌ టైటిల్‌ పోరుకు సిద్ధమైన తమ జట్టును ప్రోత్సహించేందుకు సఫారీ అభిమానులు ఎదురుచూస్తున్నారు. స్వదేశంలో సత్తా చాటి తుది పోరుకు వచ్చిన ఆ జట్టు ఈ అవకాశాన్ని పోగొట్టుకోకూడదని భావిస్తోంది. అయితే ఫైనల్లో ఆసీస్‌ను ఓడించాలంటే సఫారీలు అంచనాలకు మించి రాణించాల్సిందే. ఎందుకంటే ఆసీస్ ఐదుసార్లు చాంపియన్‌ నిలిచింది. ఈ టోర్నీ లో ఆసీస్‌ ఆటతీరు చూస్తే వారి ఆధిపత్యం మరోసారి అంగీకరించాల్సిందే. ఎందుకంటే
ఆ జట్టు ఏ ఒక్కరిపైనో ఆధారపడకుండా సమిష్టిగా, పరిస్థితులకు తగ్గట్టు ఆడుతూ ఆరోసారి టైటిల్‌పై కన్నేసింది. బ్యాటింగ్‌లో అలీసా హీలీ, బెత్‌ మూనీ చెరో తాలియా మెక్‌గ్రాత్, కెప్టెన్‌ మెగ్‌ లానింగ్‌ కీలక సమయాల్లో చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్‌లతో అదరగొడుతున్నారు. బౌలింగ్‌లో మెగాన్‌ షుట్‌ , డార్సీ బ్రౌన్, వేర్‌హమ్‌ ప్రత్యర్థి బ్యాటర్లకు చుక్కలు చూపిస్తున్నారు. వీరితో పాటు ఆల్‌రౌండర్లు గార్డ్‌నర్, ఎలీస్‌ పెర్రీ నిలకడగా రాణిస్తుండడం ఆసీస్‌కు ఆడ్వాంటేజ్‌

మరోవైపు లీగ్ స్టేజ్‌ నుంచి అనూహ్యంగా నాకౌట్ చేరిన సౌతాఫ్రికా సెమీస్‌లో అదరగొట్టింది. స్ఫూర్తి దాయకమైన ఆటతీరుతో ఇంగ్లాండ్‌కు షాక్ ఇచ్చింది. నిర్ణీత 20 ఓవర్లలో 164 పరుగులే చేశారు. ఇంగ్లాండ్ కు ఇదేం పెద్ద లక్ష్యం కాదు. అయితే దక్షిణాఫ్రికా అద్భుతమే చేసింది. క్రమం తప్పకుండా ఇంగ్లాండ్ వికెట్లు తీసి ఆ జట్టుపై ఒత్తిడి పెంచింది. కళ్లు చెదిరే క్యాచ్ లు, సింగిల్స్ ను నిలువరిస్తూ.. ఇంగ్లాండ్ జట్టును 158 పరుగులకే పరిమితం చేసింది.

మరోసారి అలాంటి ప్రదర్శనే రిపీట్ చేయాలని పట్టుదలగా ఉంది. టోర్నీ సాగుతున్న కొద్దీ సౌతాఫ్రికా ఆట మెరుగవుతూ వచ్చింది. . బ్యాటింగ్‌లో తజ్మీన్ బ్రిట్స్‌ , లౌరా వాల్‌వార్ట్‌ కీలకం కానున్నారు. అయితే మిగతా బ్యాటర్లు విఫలం కావడం జట్టు బలహీనతను చూపిస్తోంది. దీనిని ఫైనల్లో ఎలా అధిగమిస్తారనే దానిపైనే సౌతాఫ్రికా విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి. బౌలింగ్‌లో ఖాకా, మరిజాన్‌ కాప్ పై అంచనాలున్నాయి. ఇక గత రికార్డుల పరంగా సౌతాఫ్రికాపై ఆసీస్‌దే పైచేయిగా ఉంది. ఇప్పటి వరకూ ఇరు జట్లూ ఆరు మ్యాచ్‌లలో తలపడితే అన్నిసార్లూ కంగారూ జట్టే గెలిచింది.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Australia vs South Africa
  • ICC
  • Women’s T20 World Cup Final

Related News

Bumrah

ICC Rankings: ఐసీసీ ర్యాంకింగ్స్‌.. బుమ్రాకు చేరువ‌లో పాక్ బౌలర్!

ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో వన్డే సిరీస్ ఆడుతున్న భారత జట్టుకు చెందిన నలుగురు ఆటగాళ్లు ODI బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌ టాప్-10లో ఉన్నారు.

    Latest News

    • Gold Rate in India : మళ్లీ తగ్గిన బంగారం ధరలు..ఈరోజు ఎంతంటే !!

    • Virat Kohli: మ‌రోసారి డ‌కౌట్ అయిన విరాట్ కోహ్లీ!

    • Narayana Rao Commits Suicide : బాలికపై అత్యాచారం.. చెరువులో దూకి నిందితుడు ఆత్మహత్య

    • Tejaswi Yadav : ముఖ్యమంత్రి అభ్యర్థిగా తేజస్వీ యాదవ్?

    • ‎Cashew: కొలెస్ట్రాల్ తగ్గించుకుంటూనే ఆరోగ్యంగా బరువు పెరగాలంటే జీడిపప్పును ఇలా తీసుకోవాల్సిందే!

    Trending News

      • Special Trains: పండుగల వేళ స్పెషల్ ట్రైన్స్.. హర్షం వ్యక్తం చేస్తున్న ప్రయాణికులు!

      • Ishan Kishan: ఐపీఎల్ 2026.. ఈ ఆట‌గాడి కోసం మూడు ఫ్రాంచైజీల పోటీ!

      • Sanju Samson: ఆర్సీబీలోకి సంజు శాంస‌న్‌.. ఇదిగో ఫొటో!

      • PM Kisan Yojana: రైతుల‌కు శుభ‌వార్త‌.. న‌వంబ‌ర్ మొద‌టివారంలో ఖాతాల్లోకి డ‌బ్బులు?!

      • Virat Kohli- Rohit Sharma: నెట్స్‌లో చెమ‌టోడ్చిన రోహిత్‌, కోహ్లీ.. గంట‌పాటు ప్రాక్టీస్‌!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd