Ind vs Aus U19 World Cup 2024 : మరోసారి టీమ్ఇండియాకు నిరాశే ఎదురైంది..
- By Sudheer Published Date - 11:05 PM, Sun - 11 February 24
అండర్ 19 వరల్డ్ కప్ ఫైనల్లో (Ind vs Aus U19 World Cup 2024) ఆసీస్ (Australia ) చేతిలో టీమ్ ఇండియా ఘోరంగా ఓడిపోయింది. వరల్డ్ కప్ అంటే ఆసీస్ దే కప్ అని మరోసారి అంత మాట్లాడుకునేలా జరిగింది. టీమ్ ఇండియా ఫై ఆసీస్ ఏకఛత్రాధిపత్యం కొనసాగుతోంది. 2003 వరల్డ్ కప్ ఫైనల్, 2005 వరల్డ్ కప్ ఫైనల్, 2020 ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ ఫైనల్, 2023 వరల్డ్ కప్ ఫైనల్, 2024 U-19 వరల్డ్ కప్ ఇలా ఏ ఫైనల్లోను భారత్ విజయం సాధించలేకపోయింది. సీనియర్లు, జూనియర్లు, మహిళా క్రికెటర్లు ఇలా అందరు ఆసీస్ చేతిలో ఓటమి చెందారు.
We’re now on WhatsApp. Click to Join.
ఈరోజు జరిగిన అండర్ 19 వరల్డ్ కప్ ఫైనల్ (ICC U19 World Cup) లో టీమ్ఇండియా (India ) యువ జట్టుకు నిరాశే మిగిలింది. ఎంతో ఉత్కంఠగా జరిగిన ఈ పోరులో భారత జట్టు ఓటమి పాలైంది. 79 పరుగుల తేడాతో ఆసీస్ జట్టు విజయం సాధించి కప్ గెలుచుకుంది. ఆస్ట్రేలియా నిర్దేశించిన 254 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక చేతులెత్తేసింది. 174 పరుగులకే కుప్పకూలిపోయింది. దీంతో.. 79 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా ఘనవిజయం సాధించి, వరల్డ్ కప్ టైటిల్ని సొంతం చేసుకుంది. ఓపెనర్ ఆదర్శ్ సింగ్ (47), మురుగన్ (42) మినహాయించి.. ఇతర బ్యాటర్లెవ్వరూ పోరాట పటిమని కనబర్చలేకపోయారు. అందరూ చేతులెత్తేయడంతో.. భారత జట్టుకి ఈ ఓటమి తప్పలేదు.
254 పరుగులు లక్ష్యాన్ని చేధించేందుకు బరిలోకి దిగిన టీమ్ఇండియా ఆదిలోనే తొలి వికెట్ కోల్పోయింది. ఫామ్లో ఉన్న ఆర్షిన్ కులకర్ణి 3 పరుగులకే వెనుదిరిగాడు. ఆ తర్వాత వచ్చిన ముషీర్ ఖాన్(22) కూడా స్ట్రైక్ రొటేట్ చేయడం వల్ల ఇబ్బంది పడ్డాడు. దీంతో పవర్ ప్లే సమయానికి భారత జట్టు వికెట్ నష్టానికి 28 పరుగులే చేయగిలిగింది. అయినప్పటికీ వెనకడుగు వేయకుండా ఆస్ట్రేలియా పేసర్లు వేస్తున్న బంతులకు భారత ప్లేయర్లు ఆచితూచి పరుగులు స్కోర్ చేశారు. అయితే ఆసీస్ బౌలర్ల ధాటికి బ్యాటర్లు వరుసగా పెవిలియన్కు క్యూ కట్టారు. ఫైనల్లో టీమ్ ఇండియా ఓడినా అందరి మనసులు గెలుచుకుంది. లీగ్ స్టేజ్లో భారత్ ఓటమే ఎరగకుండా ఫైనల్లో అడుగు పెట్టింది. కానీ అనూహ్యంగా ఫైనల్లో బోల్తాపడింది.
Read Also : Nara Lokesh : టెక్కలి శంఖారావంలో లోకేష్ సంచలన వ్యాఖ్యలు