India Win – 100 Crore : ఇండియా గెలిస్తే 100 కోట్లు పంచుతారట!
India Win - 100 Crore : భారత్-ఆస్ట్రేలియా వన్డే ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ ఆదివారం జరగనున్న నేపథ్యంలో ఆస్ట్రోటాక్ సీఈవో పునీత్ గుప్తా సంచలన ప్రకటన చేశారు.
- By Pasha Published Date - 08:33 PM, Sat - 18 November 23

India Win – 100 Crore : భారత్-ఆస్ట్రేలియా వన్డే ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ ఆదివారం జరగనున్న నేపథ్యంలో ఆస్ట్రోటాక్ సీఈవో పునీత్ గుప్తా సంచలన ప్రకటన చేశారు. ఒకవేళ ఫైనల్లో భారత్ గెలిస్తే తమ కంపెనీ వినియోగదారులకు రూ.100 కోట్లు పంపిణీ చేస్తానని వెల్లడించారు. 2011లో టీమిండియా ప్రపంచకప్ గెలిచిన సమయంలో తాను కాలేజీలో చదువుకుంటున్నానని.. తన జీవితంలో అత్యంత ఆనందక్షణాల్లో అదొకటి అని పునీత్ అన్నారు.
We’re now on WhatsApp. Click to Join.
ఆ రోజు రాత్రంతా మ్యాచ్ గురించే మాట్లాడుకున్నామని.. మ్యాచ్‌లో మన జట్టు వ్యూహం గురించే చర్చించుకున్నామని ఆయన గుర్తుచేసుకున్నారు. మ్యాచ్ ముందు రోజు అయితే.. ఎవరు గెలుస్తారా అంటూ.. సరిగ్గా నిద్ర కూడా పోలేదని తెలిపారు. అలాంటి ఆనందం మరోసారి దక్కాలని కోరుకుంటున్నానని పునీత్ చెప్పారు. ఈసారి మన దేశం ప్రపంచకప్ గెలిస్తే యూజర్లతో కలిసి ఆనందాన్ని రూ.100 కోట్లతో పంచుకుంటానని స్పష్టం చేశారు. భారత్-ఆస్ట్రేలియా ఫైనల్ మ్యాచ్ ఆదివారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో(India Win – 100 Crore) జరగనుంది.