Virat Kohli : విరాట్ ఫై తన అభిమానాన్ని చాటుకున్న యువకుడు..ఏంచేసాడో తెలుసా..?
సన్ లైట్ ఆర్టిస్ట్..భూతద్దం, సూర్యకాంతిని ఉపయోగించి విరాట్ కోహ్లి చిత్రాన్ని రూపొందించి వైరల్ గా మారాడు
- By Sudheer Published Date - 03:51 PM, Wed - 3 April 24
స్టార్ బాట్స్మెన్ విరాట్ కోహ్లి (Virat Kohli)కి ఏ రేంజ్లో అభిమానులున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. విరాట్ కోసం ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధం అనేంతలా వీర అభిమానులు ఉన్నారు. అలాంటి వీరాభిమానులు ఎప్పటికప్పుడు విరాట్ ఫై తమకున్న అభిమానాన్ని చాటుకుంటూ వార్తల్లో నిలుస్తుంటారు. తాజాగా సన్ లైట్ ఆర్టిస్ట్..భూతద్దం, సూర్యకాంతిని ఉపయోగించి విరాట్ కోహ్లి చిత్రాన్ని రూపొందించి వైరల్ గా మారాడు.
ఇంతకీ ఈ యువకుడు ఏంచేసాడంటే..
ఓ చెక్కపై పెన్సిల్తో ముందుగానే కోహ్లి చిత్రాన్ని గీశాడు. ఆ తరువాత భూతద్దాన్ని తీసుకుని సూర్యకిరణాలు (Sunlight) ద్వారా చెక్క ఉపరితలం కాలేలా చేశాడు. ఎంతో కఠినమైన ఈ పనిలో చిన్న తప్పు జరిగినా కూడా అప్పటి వరకు పడిన కష్టం వృథా అవుతుంది. అందుకే దాదాపు రెండు , మూడు రోజులు కష్టపడి కోహ్లీ చిత్రాన్ని రూపొందించాడు. హ్లి కనుబొమ్మలైనా, గడ్డం, జుట్టు ఇలా ప్రతీ భాగాన్ని చాలా చక్కగా వచ్చేలా ఎంతో ఓర్పుతో చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతుంది.
ప్రస్తుతం విరాట్ కోహ్లి ఐపీఎల్లో బిజీగా ఉన్నాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. కోహ్లి బాగానే ఆడుతున్నా కూడా ఆర్సీబీ ఈ సీజన్లో కాస్త నిరుత్సాహపరుస్తుంది. ఇప్పటి వరకు నాలుగు మ్యాచులు ఆడిన ఆ జట్టు కేవలం ఒకే ఒక మ్యాచులో విజయాన్ని సాధించింది.
Read Also : RCB vs LSG: క్యాచ్ చేజారే…మ్యాచ్ చేజారే ఎంత పని చేశావ్ రావత్
Related News
Shah Rukh Khan : బాలీవుడ్ ‘అల్లుడు’ విరాట్ కోహ్లీ
కోల్కతా నైట్ రైడర్స్ (కెకెఆర్) సహ యజమాని, బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ స్టైలిష్ ఇండియన్ బ్యాటర్ విరాట్ కోహ్లీని "నేను అతనిని ప్రేమిస్తున్నాను" అంటూ ప్రశంసలు కురిపించాడు.