Argentina Vs France: మెగా ఫైనల్ …రికార్డుల్లో ఆ జట్టుదే పైచేయి
ఒకటేమో డిఫెండింగ్ ఛాంపియన్... మరొకటి టైటిల్ రేసులో హాట్ ఫేవరెట్.. రెండు జట్లలోనూ స్టార్ ప్లేయర్స్..
- By Nakshatra Published Date - 07:21 AM, Fri - 16 December 22
ఒకటేమో డిఫెండింగ్ ఛాంపియన్… మరొకటి టైటిల్ రేసులో హాట్ ఫేవరెట్.. రెండు జట్లలోనూ స్టార్ ప్లేయర్స్.. ఎందులోనూ ఏ జట్టూ తక్కువ కాదు.. ఇలాంటి సమఉజ్జీలు వరల్డ్‌కప్ ఫైనల్లో తలపడితే.. అభిమానులకు అంతకు మించిన పండగ ఏముంటుంది.. ఇలాంటి మ్యాచ్‌కు వేదిక కాబోతోంది ఖతార్ వరల్డ్‌కప్ ఫైనల్. ఇప్పుడు అందరి చూపూ ఈ మ్యాచ్ పైనే.. మరి ఇరు జట్ల రికార్డులు ఎలా ఉన్నాయి…
నెలరోజుల నుంచీ సాకర్ అభిమానులను ఉర్రూతలూగిస్తున్న ఫిఫా వరల్డ్‌కప్ తుది అంకానికి చేరింది. ఆదివారం డిఫెండింగ్ ఛాంపియన్ ఫ్రాన్స్, అర్జెంటీనా టైటిల్ పోరులో తలపడనున్నాయి. ఎప్పటిలానే యూరోపియన్ దేశాలదే ఆధిపత్యం కనిపించింది. అద్భుత ప్రదర్శనతో సెమీస్ వరకూ చేరిన క్రొయేషియా, మొరాకోలకు నిరాశ మిగులుస్తూ టైటిల్ ఫేవకెట్లు అర్జెంటీనా, ఫ్రాన్స్ ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచేందుకు అడుగుదూరంలో నిలిచాయి. అర్జెంటీనా స్టార్ ప్లేయర్ మెస్సీకి ఇది వాల్డ్ కప్ చాలా ప్రత్యేకమైనది. అర్జెంటీనా తరపున ఇదే చివరి మ్యాచ్ అని మెస్సీ కూడా ప్రకటించేశాడు. దీంతో ఈ సారి కప్ గెలిచి మెస్సీకి ఘనంగా వీడ్కోలు ఇవ్వాలని అర్జెంటీనా ఆటగాళ్లు ఎదురుచూస్తున్నారు. అర్జెంటీనా రికార్డులు చూస్తే ఇప్పటి వరకూ ఆ జట్టు రెండుసార్లు ఛాంపియన్‌గా నిలిచింది. 1978, 1986లో వరల్డ్‌కప్ అందుకున్న అర్జెంటీనా మూడుసార్లు రన్నరప్‌తో సరిపెట్టుకుంది. 2014లో ఫైనల్ చేరడం చివరిసారిగా ఆ జట్టు బెస్ట్ పెర్ఫార్మెన్స్. మెస్సీ హయాంలో ఆ జట్టు వరల్డ్‌కప్ గెలవలేదు. దీంతో ఈ సారి ఆ కోరిక నెరవేర్చుకుని అంతర్జాతీయ కెరీర్ ఘనంగా ముగించాలని మెస్సీ భావిస్తున్నాడు.
మరోవైపు డిఫెండింగ్ ఛాంపియన్ ఫ్రాన్స్ తనపై ఉన్న అంచనాలకు తగ్గట్టే ఫైనల్‌కు దూసుకొచ్చింది. స్టార్ స్ట్రైకర్ ఎంబపే అంచనాలకు తగ్గట్టు రాణిస్తుండగా.. ట్యునీషియా చేతిలో ఓటమి తప్పిస్తే ఓవరాల్‌గా ఫ్రెంచ్ టీమ్ అదరగొడుతోంది. వరుసగా రెండుసార్లు ఫైనల్ చేరిన జట్టుగా ఫ్రాన్స్ రికార్డులకెక్కింది. గత రికార్డులు చూస్తే ఫ్రాన్స్ 1998లోనూ, 2018లోనూ ఛాంపియన్‌గా నిలిచింది. ఇప్పటి వరకూ సాకర్ ప్రపంచకప్‌లో వరుసగా రెండోసారి టైటిల్ గెలిచిన రికార్డు ఏ జట్టుకూ లేదు. ఈ సారి చరిత్రను తిరగరాయాలని పట్టుదలగా ఉంది ఫ్రాన్స్. గత రికార్డుల పరంగా అర్జెంటీనాదే పైచేయిదా ఉంది. 12 మ్యాచ్‌లలో ఆరుసార్లు మెస్సీ టీమ్ గెలిస్తే మూడుసార్లు ఫ్రాన్స్ గెలిచింది. టైటిల్ పోరు కావడంతో ఇరు జట్ల పైనా ఒత్తిడి ఉంటుందని చెప్పొచ్చు. దీంతో మెగా టోర్నీ ఫైనల్ నువ్వా నేనా అన్నట్టు సాగడం ఖాయంగా కనిపిస్తోంది.
Related News
Vijay Mallya: విజయ్ మాల్యా కోసం ఫ్రాన్స్‌కు భారత్ విజ్ఞప్తి
కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ మాజీ ప్రమోటర్, మద్యం వ్యాపారి విజయ్ మాల్యాను భారత్‌కు తీసుకురావడానికి ప్రయత్నాలు ముమ్మరం చేశాయి.