Apko Jawab Milega : టీ ట్వంటీ వరల్డ్ కప్ ఆడతారా ? రోహిత్ ఇచ్చిన సమాధానమిదే..
- By Sudheer Published Date - 06:22 PM, Mon - 25 December 23

వన్డే ప్రపంచకప్ (World Cup) ఫైనల్లో ఓటమి తర్వాత పలువురు సీనియర్ క్రికెటర్లు (Senior Cricketers) రెస్ట్ తీసుకున్నారు.. నిజానికి మెగా టోర్నీ ఆరంభానికి ముందే సీనియర్ల భవిష్యత్తుపై చర్చ జరిగింది. రోహిత్ శర్మ (Rohit Sharma), కోహ్లీ (Virat Kohli) టీ ట్వంటీ కెరీర్ ముగిసినట్టేనని వార్తలు వచ్చాయి. వచ్చే ఏడాది జరగనున్న టీట్వంటీ వరల్డ్ కప్ లో వీరిద్దరూ ఆడతారా లేదా అనేది అందరిలోనూ ఆసక్తిని రేకెత్తిస్తోంది. ముఖ్యంగా టీ ట్వంటీ కెప్టెన్సీ పగ్గాలు హార్థిక్ పాండ్యాకు పూర్తి స్థాయిలో ఇవ్వబోతున్నారన్న ఊహాగానాల మధ్య రోహిత్ గుడ్ బై చెప్పడం ఖాయమని చాలా మంది భావిస్తున్నారు. కోహ్లీ వరల్డ్ కప్ ఆడే అవకాశం ఉన్నా.. ఫిట్ నెస్ ను దృష్టిలో ఉంచుకుంటే రోహిత్ కష్టమని కొందరు అంచనా వేస్తున్నారు. దీనికి తోడు ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ కోల్పోయిన హిట్ మ్యాన్ కు సౌతాఫ్రికాతో టెస్ట్ సిరీస్ కు ముందు విలేఖరుల నుంచి ఇదే ప్రశ్న ఎదురైంది. వచ్చే వరల్డ్ కప్ లో జట్టును నడిపిస్తారా అన్న ప్రశ్నకు రోహిత్ చాలా తెలివిగా సమాధానమిచ్చాడు.
We’re now on WhatsApp. Click to Join.
మీరు నా నుంచి ఎలాంటి సమాధానం కోరుకుంటున్నారో నాకు తెలుసు…. త్వరలోనే మీకు జవాబు దొరుకుతుందంటూ రోహిత్ వ్యాఖ్యానించాడు. సౌతాఫ్రికా గడ్డపై సిరీస్ గెలవాలన్న లక్ష్యం ఈ సారి నెరవేర్చుకుంటామని భారత కెప్టెన్ చెప్పాడు. కాగా రోహిత్ అంతర్జాతీయ టీ ట్వంటీ కెరీర్ దాదాపు ముగిసినట్టేనని చెప్పొచ్చు. గత కొంతకాలంగా టీ ట్వంటీ సిరీస్ లకు రోహిత్ , కోహ్లీలను బీసీసీఐ ఎంపిక చేయట్లేదు. సీనియర్లకు రెస్ట్ ఇచ్చామని చెబుతున్నా…ఓవరాల్ గా 2024 టీ ట్వంటీ వరల్డ్ కప్ కు పూర్తి యువ జట్టునే ఎంపిక చేసే అవకాశముందని తెలుస్తోంది. కాగా 36 ఏళ్ల రోహిత్ శర్మ ఇప్పటి వరకూ 148 టీ ట్వంటీ మ్యాచ్ లు ఆడాడు. 30.82 సగటుతో 3,853 పరుగులు చేయగా… ఇందులో 4 సెంచరీలున్నాయి.
Read Also : Dawood Properties : దావూద్ ఇబ్రహీం ఆస్తుల వేలం.. ఎన్ని ఆస్తులున్నాయంటే ?