CM Jagan : ఆత్మకూరు ప్రజలకు ధన్యవాదాలు తెలిపిన సీఎం జగన్… ప్రభుత్వం చేసిన మంచి పనులే ..!
- Author : Prasad
Date : 26-06-2022 - 3:46 IST
Published By : Hashtagu Telugu Desk
ఆత్మకూరు ఉప ఎన్నికలో వైఎస్సార్‌సీపీ ఘనవిజయంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్పందించారు. ప్రభుత్వం చేసిన మంచి పనులు, గౌతంరెడ్డికి నివాళులు అర్పిస్తూ ప్రజలు 83 వేల ఓట్ల మెజారిటీనిచ్చారని సీఎం ట్వీట్ చేశారు. విక్రమ్‌రెడ్డికి ఓటు వేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపిన సీఎం జగన్.. ప్రభుత్వానికి దేవుడి దయ, ప్రజల ఆశీస్సులు ఉంటే చాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఆత్మకూరు ఉప ఎన్నికల్లో అధికార వైఎస్సార్‌సీపీ ఘనవిజయం సాధించింది. ఉప ఎన్నికలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్‌రెడ్డి 82,888 ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందారు. ఉప ఎన్నికల్లో బరిలో నిలిచిన బీజేపీ అభ్యర్థి భరత్ కుమార్ డిపాజిట్ కోల్పోయారు. వైఎస్సార్‌సీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్‌రెడ్డికి 1,02,240 ఓట్లు రాగా, బీజేపీ అభ్యర్థి భరత్‌కుమార్‌కు 19,352 ఓట్లు వచ్చాయి.
ప్రభుత్వం చేసిన మంచికి మద్దతుగా, గౌతమ్ కు నివాళిగా… ఆత్మకూరులో 83 వేల భారీ మెజార్టీతో విక్రమ్ ను దీవించిన ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి సోదరుడికి, ప్రతి స్నేహితుడికి… ప్రతి అవ్వకు, ప్రతి తాతకు… పేరుపేరునా ధన్యవాదాలు! (1/2)
— YS Jagan Mohan Reddy (@ysjagan) June 26, 2022