YS Jagan Wishes: బాబుకు జగన్ ‘బర్త్ డే’ విషెస్!
తన పుట్టినరోజు సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మను దర్శించుకున్నారు.
- By Balu J Published Date - 03:08 PM, Wed - 20 April 22
తన పుట్టినరోజు సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మను దర్శించుకున్నారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, మాజీ మంత్రి దేవినేని ఉమ, ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ఆయన వెంట ఉన్నారు. బాబు పుట్టినరోజును పురస్కరించుకొని వివిధ రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ క్రమంలో ఏపీ సీఎం జగన్ రెడ్డి కూడా బాబుకు శుభాకాంక్షలు తెలిపారు. Wish you a happy birthday @ncbn garu అంటూ ట్విట్టర్ వేదికగా స్పందించారు.
Wish you a happy birthday @ncbn garu.
— YS Jagan Mohan Reddy (@ysjagan) April 20, 2022