YS Jagan : ప్రవాసాంధ్రులతో జగన్ భేటీ
- By CS Rao Published Date - 05:30 PM, Wed - 25 May 22

పెట్టుబడులను ఆకర్షించే నిమిత్తం దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సుకు హాజరైన సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వరుస భేటీలతో బిజీబిజీగా గడుపుతున్నారు. ఈ క్రమంలో బుధవారం దావోస్‌లో ఆయనను పలువురు యూనికార్న్ స్టార్టప్స్ వ్యవస్థాపకులు, ప్రవాసాంధ్రులు కలిశారు. వీరంతా కలిసి జగన్‌తో గ్రూప్ ఫొటో దిగారు. ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వం చేపడుతున్న పలు పథకాలను వారు అభినందించినట్టు సమాచారం.
జగన్‌ను కలిసిన వారిలో మీషో వ్యవస్థాపకుడు, సీఈఓ విదిత్ ఆత్రేయ, బైజూస్ వైస్ ప్రెసిడెంట్ పబ్లిక్‌పాలసీ సుష్మిత్ సర్కార్, కాయిన్‌స్విచ్ క్యూబర్ వ్యవస్థాపకుడు, గ్రూప్ సీఈఓ ఆశిష్ సింఘాల్, ఈజీమై ట్రిప్ ప్రశాంత్ పిట్టి, వీహివ్.ఏఐ వ్యవస్థాపకుడు సతీష్ జయకుమార్, కొర్‌సెరా వైస్ ప్రెసిడెంట్ కెవిన్ మిల్స్ తదితరులు ఉన్నారు.
దావోస్:యూనికార్న్ స్టార్టప్స్ వ్యవస్థాపకులు, సీఈఓలతో దావోస్‌లో సీఎం శ్రీ వైయస్.జగన్ భేటీ. ముఖ్యమంత్రిని కలిసిన వారిలో మీషో వ్యవస్థాపకుడు, సీఈఓ విదిత్ ఆత్రేయ, బైజూస్ వైస్ ప్రెశిడెంట్ పబ్లిక్‌పాలసీ సుష్మిత్ సర్కార్ 1/2 ….#CMYSJaganInDavos pic.twitter.com/dK4oJDpp2C
— YSR Congress Party (@YSRCParty) May 25, 2022