Jagan Kadapa Tour : రెండు రోజుల కడప పర్యటనకు జగన్
ఏపీ ముఖ్యమంత్రి జగన్ సొంత జిల్లాకు గురువారం వెళ్లనున్నారు. రెండు రోజుల పాటు కడప జిల్లాలో పర్యటిస్తారు.
- By CS Rao Published Date - 06:01 PM, Wed - 6 July 22

ఏపీ ముఖ్యమంత్రి జగన్ సొంత జిల్లాకు గురువారం వెళ్లనున్నారు. రెండు రోజుల పాటు కడప జిల్లాలో పర్యటిస్తారు. తాడేపల్లి నివాసం నుంచి ఉదయం గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో కడప ఎయిర్ పోర్టుకు వెళతారు. ఉదయం 11 గంటలకు పులివెందులలోని ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ కు చేరుకుని అక్కడ రెండు గంటల పాటు పులివెందుల మున్సిపాలిటీ ప్రతినిధులతో భేటీ అవుతారు.మధ్యాహ్నం ఒంటి గంట నుంచి మూడు గంటల వరకు పలు కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి పాల్గొంటారు. మధ్యాహ్నం 3 గంటలకు వేంపల్లికి చేరుకుంటారు. అక్కడ బాలికలు, బాలుర ఉన్నత పాఠశాలలను ప్రారంభిస్తారు. సాయంత్రం 5.30 గంటలకు ఇడుపులపాయకు చేరుకుంటారు. ఎల్లుండి ఉదయం 8 గంటలకు ఇడుపులపాయలోని వైయస్సార్ ఘాట్ కు చేరుకుని, ఆయన జయంతి సందర్భంగా నివాళులు అర్పిస్తారు. అనంతరం విజయవాడకు చేరుకుంటారు.