Rape Case: మైనర్ బాలికపై 5 రోజులుగా అత్యాచారం
మైనర్ బాలికను కిడ్నప్ చేసి అత్యాచారం చేసిన ఘటన ఉత్తరప్రదేశ్ జిల్లాలోని బదౌన్ లో చోటు చేసుకుంది. కస్బా కచ్లా వార్డులో 16 ఏళ్ల బాలిక నివసిస్తుంది.
- By Praveen Aluthuru Published Date - 11:58 AM, Sun - 10 September 23

Rape Case: మైనర్ బాలికను కిడ్నప్ చేసి అత్యాచారం చేసిన ఘటన ఉత్తరప్రదేశ్ జిల్లాలోని బదౌన్ లో చోటు చేసుకుంది. కస్బా కచ్లా వార్డులో 16 ఏళ్ల బాలిక నివసిస్తుంది. సెప్టెంబర్ 5న అదే ప్రాంతానికి చెందిన ముస్కాన్ అనే యువకుడు అక్కడికి వచ్చాడు. ఒక్కసారిగా బాలికను కౌగిట్లో బందించి నోరు మూయించాడు. ఇతరుల సాయంతో ఎత్తుకుని తన ఇంటికి తీసుకెళ్లాడు. ఆ తర్వాత ముస్కాన్ ఆమెపై అత్యాచారం చేస్తూనే ఉన్నాడు. ఈ విషయం తెలుసుకున్న బాలిక కుటుంబ సభ్యులు ముస్కాన్ ఇంటికి చేరుకుని కూతురిని బయటకు పిలిచారు. నిందితుడిపై బాధితురాలి తండ్రి ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు ముస్కాన్‌పై కిడ్నాప్, అత్యాచారం, దాడి మరియు బెదిరింపు వంటి సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఈ మొత్తం ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. పోలీసులు బాలికను బందీ నుంచి విడిపించి వైద్య పరీక్షల నిమిత్తం తరలించారు.
Also Read: Morocco Earthquake: మొరాకోలో భారీ భూకంపం.. 2,000 మందికి పైగా మృతి