Loan App: లోన్‌యాప్ వేధింపులకు యువకుడు బలి
హైదరాబాద్ జియాగూడలో ఆదివారం ఓ యువకుడు తన ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
- By Hashtag U Published Date - 02:58 PM, Tue - 19 April 22

హైదరాబాద్ జియాగూడలో ఆదివారం ఓ యువకుడు తన ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆన్‌లైన్ లోన్ యాప్ మేనేజ్‌మెంట్ నుండి వేధింపుల కారణంగా మరణించాడని అతని కుటుంబ సభ్యులు ఆరోపించారు. వేధింపులకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లభించలేదని, ప్రస్తుతం లాక్‌లో ఉన్న అతడి మొబైల్‌ను పరిశీలించిన తర్వాతే మరిన్ని వివరాలు తెలుస్తాయని పోలీసులు తెలిపారు. జియాగూడలోని న్యూ గంగా నగర్‌కు చెందిన బాధితుడు ఎం.రాజ్‌కుమార్(22) రూ.12వేలు అప్పు చేసి రూ.4వేలు చెల్లించగా మిగిలిన మొత్తాన్ని చెల్లించలేకపోయాడు.
దీంతో ఆన్‌లైన్ లోన్ యాప్ ఎగ్జిక్యూటివ్‌లు అతనిని వేధించడం మొదలుపెట్టారు. ఇటీవల అతనితో పరిచయాలు ఉన్న వారికి లోన్ మొత్తాన్ని తిరిగి చెల్లించాలని లేదంటే చట్టపరమైన చర్య తీసుకుంటామని బెదిరిస్తూ సందేశాలు పంపారు. దీంతో మనస్తాపం చెంది ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడని బంధువులు ఆరోపించారు. ప్రస్తుతం అతని ఫోన్ లాక్ లో ఉందని.. పాస్‌వర్డ్ ఎవరికీ తెలియదని పోలీసులు తెలిపారు. నిపుణుల సాయంతో పాస్‌వర్డ్ తీసేందుకు ప్రయత్నిస్తున్నామని.. అప్పుడు మాత్రమే అతను లోన్ యాప్ వేధింపులకు గురైనట్లు తాము నిర్ధారించగలమని పోలీసులు తెలిపారు.