YCP MLA Undavalli Sridevi : కాసేపట్లో మీడియా ముందుకు వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి.. ఏం మాట్లాడతారనే దానిపై చర్చ..?
వైసీపీలో నలుగురు ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వేటు వేయడం ఇప్పుడు ఏపీలో చర్చనీయంశంగా మారింది. సస్పెన్షన్‌పై ఇప్పటికే
- Author : Prasad
Date : 26-03-2023 - 11:27 IST
Published By : Hashtagu Telugu Desk
వైసీపీలో నలుగురు ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వేటు వేయడం ఇప్పుడు ఏపీలో చర్చనీయంశంగా మారింది. సస్పెన్షన్‌పై ఇప్పటికే ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి స్పందించారు. తాజాగా మరో ఎమ్మెల్యే ఉండవల్లి శ్రేదేవి మీడియా ముందుకు రానున్నారు. వైసీపీ అధిష్టానం తనను సస్పెన్షన్ చేయడంపై ఆమె మాట్లాడనున్నట్లు సమాచారం. దీంతో పాటు నియోజకవర్గంలో తనకు ఎదురవుతున్న ఇబ్బందులు, అధిష్టానం ఇప్పటి వరకు తనకు ఎలాంటి సహకారం అందింది అనే దానిపై మాట్లాడనున్నట్లు తెలుస్తోంది. ఓటింగ్ రోజు తాను ఎలాంట్రి క్రాస్ ఓటింగ్‌కు పాల్పడలేదని ఆమె కొన్ని మీడియా సంస్థలకు తెలిపారు. తాను దళిత ఎమ్మెల్యేకావడంతోనే తనపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని తెలిపారు. ఈ రోజు మీడియా ముందు ఏం మాట్లాడతారనేది ఆసక్తి నెలకొంది.