YCP MLA : ప్రభుత్వ సలహాదారు “సజ్జల” నుంచే నాకు ప్రాణ హాని – ఎమ్మెల్యే శ్రీదేవి
తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను డాక్టర్ సుధాకర్ లాగా అవుతాననే భయం ఉందంటూ
- Author : Prasad
Date : 26-03-2023 - 12:00 IST
Published By : Hashtagu Telugu Desk
తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను డాక్టర్ సుధాకర్ లాగా అవుతాననే భయం ఉందంటూ మీడియా ముందు వ్యాఖ్యలు చేశారు. తనకు ఎదైనా హాని ఉందంటే అది ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి నుంచే నంటూ వ్యాఖ్యలు చేశారు. తాను జాతీయ ఎస్సీ కమిషన్‌కు ఫిర్యాదు చేస్తానని తెలిపారు. తనకు పోలీసుల రక్షణ కల్పించాలని ఆమె కోరారు. వచ్చే ఎన్నికల్లో జగన్‌కు రిటర్న్ గిఫ్ట్ ఇస్తానంటూ వ్యాఖ్యానించారు. అమరావతి ఉద్యమంలో ఇక నుంచి యాక్టీవ్‌గా ఉంటానని ఆమె తెలిపారు.