Yadadri Brahmotsavam: మహావిష్ణు అలంకరణలో యాదాద్రీశుడు
స్వామివారు శ్రీ మహావిష్ణు అలంకారంలో గరుడవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు.
- By Balu J Published Date - 03:22 PM, Wed - 1 March 23

యాదగిరిగుట్టలోని శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. బుధవారం స్వామివారు శ్రీ మహావిష్ణు అలంకారంలో గరుడవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ప్రధానార్చకుల ఆధ్వర్యంలో యజ్ఞాచార్యులు, ఉప ప్రధానార్చకులు, అర్చకులు, పారాయణీకుల మంతోచ్ఛరణల మధ్య స్వామివారు మాఢవీధుల్లో విహరించారు. పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిత్యారాధనల అనంతరం చతుస్థానార్చనలు, మండపారాధనలు, మూలమంత్రజపాలు, ద్వారతోరణ పూజలు, దివ్య ప్రబంధాలు తదితరుల కార్యక్రమాలు కొనసాగుతాయని ఆలయ నిర్వహకులు తెలిపారు.