ప్రపంచంలోనే పురాతన వృక్షం.. దిని గురించి పూర్తిగా తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
- By Anshu Published Date - 07:54 AM, Sun - 12 June 22
ప్రపంచంలోనే అత్యంత పెద్ద వృక్షం ఏది అని అడిగితే చెప్పడం చాలా కష్టం అని అంటూ ఉంటారు. పోనీ ఎక్కడ ఉందో తెలుసా అంటే అది కూడా కష్టమే అని చెబుతూ ఉంటారు. ఇప్పుడు మనం ప్రపంచంలోకెల్లా అతి పురాతన వృక్షం అతిపెద్ద వృక్షం ఎక్కడ వుందో దాని ప్రత్యేకత ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రపంచంలో కెల్లా అత్యంత పెద్ద వృక్షం దక్షిణ చిలీ లో ఉంది. అయితే ఇది మనము చెబుతున్న మాట కాదు ఎన్నో అధ్యయనాలు, పరిశోధనలు చేసిన తరువాత ఈ భూమి మీద ఎక్కువ వయస్సు ఉన్న వృక్షం అక్కడే ఉంది అని శాస్త్రవేత్తలు తేల్చి చెప్పారు. ఈ దక్షిణ చిలీ లోని అటవీ ప్రాంతంలో ఉన్న ఒక భారీ వృక్షం వయసు దాదాపు 5వేల సంవత్సరాలు పైమాటే అని చెప్పవచ్చు.
దక్షిణ చిలీ దేశానికి చెందిన జొనాధన్ అని శాస్త్రవేత్త ఈ మహా వృక్షాన్ని గుర్తించారు. ప్రస్తుతం అతను పారిస్ లోని ఒక లేబరేటరీ లో పనిచేస్తున్నారు. ఈ మహావృక్షాన్ని పాతగోనియస్ సర్ప్రైస్ లేదా అల్సేర్ మిలెనరియో గా పిలుస్తారట. ఈ మహా వృక్షం రెడ్ వుడ్ జాతికి చెందినది. ఇవి దాదాపుగా 45 మీటర్ల ఎత్తు వరకూ పెరుగుతాయి. అయితే ఈ వృక్షం వయసు కనుగొనడానికి అనేక ఆధునిక పద్ధతులు శాస్త్రీయంగా పరిశోధనలు చేసిన తర్వాత ఈ వృక్షానికి దాదాపుగా 5,484 సంవత్సరాల వయస్సు ఉంటుంది అని నిర్ధారించారు.