Video Viral: జిమ్ లో జుట్లు పట్టుకుని కొట్టుకున్న మహిళలు.. వీడియో వైరల్?
ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో గొడవలకు సంబంధించిన వీడియోలు ఎక్కువగా వైరల్ అవుతున్నాయి. వాటిలో
- Author : Anshu
Date : 13-10-2022 - 7:14 IST
Published By : Hashtagu Telugu Desk
ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో గొడవలకు సంబంధించిన వీడియోలు ఎక్కువగా వైరల్ అవుతున్నాయి. వాటిలో ఎక్కువగా మహిళలకు సంబంధించిన వీడియోలే వైరల్ అవుతున్నాయి. మహిళలు చిన్న చిన్న విషయాలకే రోడ్లపై బస్సులు ట్రైన్ లలో కొట్టుకోవడం లాంటి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో పాటు నెటిజన్స్ కి నవ్వులు తెప్పిస్తున్నాయి. ఇది ఇలా ఉంటే ఇటువల ముంబై లోకల్ ట్రైన్ లో ఒక సీటు కోసం ఇద్దరు మహిళలు అందరూ చూస్తుండగానే జుట్టు పట్టుకొని కొట్టుకున్న విషయం తెలిసిందే.
ట్రైన్ లో ఉన్న ఇతర ప్యాసింజర్లు ఎంత ఆపడానికి ప్రయత్నించినా కూడా వారు ఏమాత్రం తగ్గలేదు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిన విషయం తెలిసిందే. తాజాగా అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇద్దరు మహిళలు జిమ్ లో కొట్టుకున్నారు. ఆ వీడియోలో కొందరు మహిళలు ఎక్స్ సైజ్ చేస్తున్నారు. ఇక అందులో ఇద్దరు మహిళలు ఒకచోట నిలబడి ఒక మహిళ వెయిట్ లిఫ్ట్ చేస్తుండగా మరొక మహిళ ఆ వెయిట్ లిఫ్ట్ మిషన్ కోసం ఎదురుచూస్తోంది.
Kalesh Inside GYM for Smith Machine pic.twitter.com/KXy6v9UyWj
— r/Bahar Ke Kalesh (@Baharkekalesh) October 9, 2022
ఒక యువతి ఆమె పని చూసుకొని మిషన్ దగ్గర నుంచి వెళ్ళిపోగా మరొక మహిళ వెయిట్ లిఫ్ట్ మిషన్ దగ్గరికి వెళ్ళగానే ఇంతలోనే అక్కడికి మరొక యువతి వచ్చి ఆమెను పక్కకు తోసింది. దీంతో చిర్రె ఎత్తుకొచ్చిన ఆ మహిళ వెంటనే ఆ మహిళ జుట్టు పట్టుకుంది అలా వారిద్దరూ ఒకరి చుట్టూ ఒకరి జుట్టు మరొకరు పట్టుకుని కొట్టుకుంటుండగా ఇంతలో అక్కడికి కొందరు మహిళలు వచ్చి వారిని బలవంతంగా విడిపించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఆ వీడియో పై నెటిజన్స్ ఫన్నీగా స్పందిస్తున్నారు.