Delhi : ఢిల్లీ నుంచి యూపీ వెళ్తున్న బస్సులో ప్రసవించిన మహిళ
ఢిల్లీ నుంచి యూపీలోని ఛిబ్రామౌ వెళ్తున్న బస్సులో ఓ మహిళ మగబిడ్డకు జన్మనిచ్చింది.
- By Prasad Published Date - 08:06 AM, Tue - 6 December 22

ఢిల్లీ నుంచి యూపీలోని ఛిబ్రామౌ వెళ్తున్న బస్సులో ఓ మహిళ మగబిడ్డకు జన్మనిచ్చింది. డ్రైవర్ వెంటనే అప్రమత్తమై ఆసుపత్రికి తీసుకెళ్లాడు, అక్కడ వైద్యులు తల్లి, నవజాత శిశువుకు చికిత్స అందించారు. ఎటా జిల్లాకు తన భర్తతో కలిసి ప్రయాణిస్తున్న మహిళకు ప్రసవ నొప్పి వచ్చింది. దీంతో ఆమె బస్సులోనే ప్రసవించింది. తల్లీబిడ్డలు క్షేమంగా ఉన్నారని వైద్యులు తెలిపారు