RIMS Ranchi : రాంచీ రిమ్స్‌లో ఐదుగురు పిల్లలకు జన్మనిచ్చిన మహిళ
జార్ఖండ్‌లోని రాంచీలోని రిమ్స్‌లో సోమవారం ఓ మహిళ ఐదుగురు పిల్లలకు జన్మనిచ్చింది. ప్రస్తుతం తల్లి, బిడ్డలు ఆరోగ్యంగా
- Author : Prasad
Date : 23-05-2023 - 8:06 IST
Published By : Hashtagu Telugu Desk
జార్ఖండ్‌లోని రాంచీలోని రిమ్స్‌లో సోమవారం ఓ మహిళ ఐదుగురు పిల్లలకు జన్మనిచ్చింది. ప్రస్తుతం తల్లి, బిడ్డలు ఆరోగ్యంగా ఉన్నారు. మొత్తం ఐదుగురు శిశువులు ఆరోగ్యకరమైన స్థితిలో ఉన్నారు. వీరిని అబ్జర్వేషన్ కోసం నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (NICU)లో ఉంచారు. ఈ విషయాన్ని రిమ్స్ రాంచీ తన ట్విట్టర్ లో తెలిపింది. చాటర్‌కు చెందిన ఒక మహిళ RIMSలోని ప్రసూతి & గైనకాలజీ విభాగంలో ఐదుగురు పిల్లలకు జన్మనిచ్చిందని వెల్లడించింది. శిశువులు NICUలో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని.. ఈ విజయవంతమైన ఆపరేషన్ డాక్టర్ శశిబాలా సింగ్ నాయకత్వంలో నిర్వహించినట్లు తెలిపింది. నవజాత శిశువులు తక్కువ బరువుతో ఉన్నారని.. ప్రస్తుతానికి వారిని NICUలో ఉంచి వైద్యులు పర్యవేక్షిస్తున్నట్లు రిమ్స్ రాంచీ వెల్లడించింది.
रिम्स के महिला एवं प्रसूति विभाग में इटखोरी चतरा की एक महिला ने पांच बच्चों को जन्म दिया है। बच्चें NICU में डाक्टरों की देखरेख में हैं। डॉ शशि बाला सिंह के नेतृत्व में सफल प्रसव कराया गया। @HLTH_JHARKHAND pic.twitter.com/fdxUBYoPoP
— RIMS Ranchi (@ranchi_rims) May 22, 2023