HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Windman Of India Tulsi Tanti Passed Away

Wind man of India : గుండెపోటుతో ‘విండ్‌మ్యాన్ ఆఫ్‌ ఇండియా’ తులసీ తాంతీ మృతి..!!

ప్రముఖ ఇంధన సంస్థ సుజ్లాన్‌ ఎనర్జీ వ్యవస్థాపకుడు తులసీ తాంతీ (64) మృతిచెందారు. గుండెపోటుతో ఆయన శనివారం మృతిచెందిన‌ట్లు కంపెనీ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపింది.

  • Author : hashtagu Date : 02-10-2022 - 4:35 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Tulasi Thanthi
Tulasi Thanthi

ప్రముఖ ఇంధన సంస్థ సుజ్లాన్‌ ఎనర్జీ వ్యవస్థాపకుడు తులసీ తాంతీ (64) మృతిచెందారు. గుండెపోటుతో ఆయన శనివారం మృతిచెందిన‌ట్లు కంపెనీ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపింది. శ‌నివారం అహ్మదాబాద్‌లో జరిగిన ఓ కార్య‌క్ర‌మం నుంచి వ‌చ్చిన‌ ఆయన పుణెలో ఉండగా ఛాతిలో నొప్పిగా ఉన్నట్లు డ్రైవర్‌కు చెప్పారు. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లాలని డ్రైవ‌ర్‌ను సూచించారు. అక్కడికి చేరుకునే లోపే ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు ధ్రువీకరించారని ప్ర‌ముఖ వార్తా సంస్థ‌లు పేర్కొన్నాయి. ఆయనకు భార్య గీత, కుమారుడు ప్రణవ్‌, కుమార్తె నిధి ఉన్నారు.

మన దేశంలో పవన విద్యుదుత్పత్తి రంగంలో ఉన్న అవకాశాల్ని చాటిచెప్పిన తాంతీని భారత ‘విండ్‌ మ్యాన్‌’గా వ్యవహరిస్తుంటారు. సుజ్లాన్‌ ఎనర్జీని 1995లో స్థాపించి త‌క్కువ కాలంలోనే దాన్ని గ్లోబల్‌ సంస్థలతో పోటీపడేలా తీర్చిదిద్దారు. 1958లో రాజ్‌కోట్‌లో జన్మించిన తాంతీ గుజరాత్ విశ్వవిద్యాలయం నుండి కామర్స్‌లో బ్యాచిలర్ డిగ్రీని పూర్తి చేశారు. అతను 1995లో సుజ్లాన్ ఎనర్జీని స్థాపించాడు. ఇప్పుడు దాని విలువ రూ. 8,535.9 కోట్లు. తాంతీ.. బెల్జియం ఆధారిత టర్బైన్ విడిభాగాల తయారీదారు ZF విండ్ పవర్ ఆంట్వెర్పెన్‌కు ఛైర్మన్‌గా, ఇండియన్ విండ్ టర్బైన్ తయారీదారుల సంఘం అధ్యక్షుడిగా కూడా ప‌ని చేశారు.

తాంతీ మరణంపై ప్రధానమంత్రి మోదీ సహా పలువురు వ్యాపారస్తులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘‘తులసీ తాంతీ గొప్ప దార్శనికుడు. దేశ ఆర్థిక ప్రగతికి ఆయన ఎంతో కృషి చేశారు. భారత సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనలో తోడ్పాటునందించారు. ఆయన అకాల మరణం నన్ను కలచివేసింది. ఆయన కుటుంబ సభ్యులు, సన్నిహితులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను’’ అని మోదీ ట్వీట్‌ చేశారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • business news
  • suzlon
  • tulsitanti

Related News

Bank Holidays

మార్చి నెలలో బ్యాంకులు ఎన్ని రోజులు మూత‌ప‌డ‌నున్నాయంటే?

హోలీ పండుగ నేపథ్యంలో అగర్తల, అహ్మదాబాద్, ఐజ్వాల్, భువనేశ్వర్, చండీగఢ్, ఇంఫాల్, ఈటానగర్, జమ్మూ, న్యూఢిల్లీ, రాయ్‌పూర్, షిల్లాంగ్, సిమ్లాలలో బ్యాంకులు మూతపడతాయి.

  • Income Tax

    ఐటీఆర్ రిఫండ్ పేరుతో కొత్త రకం మోసం.. జాగ్రత్తగా ఉండకపోతే ఖాతా ఖాళీ!

  • PM Kisan

    పీఎం కిసాన్ 22వ విడత.. ఈ వారమే రూ. 2000 వచ్చే అవకాశం?

  • Gold- Silver

    ఆకాశాన్నంటుతున్న బంగారం, వెండి ధరలు!

  • Gold- Silver Price

    గరిష్ట స్థాయి నుండి చౌకగా మారిన వెండి ధర! ఎంతంటే?!

Latest News

  • పిల్లల్లో పెరుగుతున్న మధుమేహం.. తల్లిదండ్రులు గమనించాల్సిన హెచ్చరిక సంకేతాలివే!

  • టీమిండియా సెమీ ఫైన‌ల్‌కు చేరాలంటే?!

  • సుదీర్ఘ నిరీక్షణకు తెర .. కేరళ ఇక పై ‘కేరళం’.. పేరు మార్పుకు కేంద్ర కేబినెట్ ఆమోదం

  • ఉగ్రవాదంపై కేంద్రం ఉక్కుపాదం.. కొత్త యాంటీ టెర్రర్ పాలసీ ‘ప్రహార్’ విడుదల!

  • ఇది దేవుడికే చేసిన మహా అపచారం : లడ్డూ కల్తీ వ్యవహారం సీఎం చంద్రబాబు తీవ్ర ఆరోపణలు

Trending News

    • టీ20 వరల్డ్ కప్ 2026 షెడ్యూల్‌లో భారీ మార్పులు.. శ్రీలంక, పాకిస్థాన్ జట్ల కోసం కొత్త రూల్స్!

    • ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026.. భారత్-పాక్ మధ్య ఫైనల్ సాధ్యమేనా?

    • అమెరికా ఈశాన్యాన్ని వణికిస్తున్న ‘బాంబ్ సైక్లోన్’.. స్తంభించిన జనజీవనం .. వేల విమానాల రద్దు ..!

    • తియ్యని, రసభరితమైన దానిమ్మను ఎంచుకోవడం ఎలా? ఇవే సులభమైన చిట్కాలు!

    • టీమ్ ఇండియాకు షాక్.. సెమీస్ దారులు మూసుకుపోయినట్లేనా?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd