Wimbledon 2023: మొదలైన వింబుల్డన్ గ్రాండ్ స్లామ్ మ్యాచ్ లు.. సీరియస్ వార్నింగ్ ఇచ్చిన టెన్నిస్ నిర్వాహకులు?
తాజాగా సోమవారం నుంచి వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ ప్రారంభమైన విషయం తెలిసిందే. అయితే వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్‌లో మ్యాచ్‌లు జరిగే కోర్టుల వద్
- By Anshu Published Date - 04:40 PM, Tue - 4 July 23

తాజాగా సోమవారం నుంచి వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ ప్రారంభమైన విషయం తెలిసిందే. అయితే వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్‌లో మ్యాచ్‌లు జరిగే కోర్టుల వద్ద క్వైట్ రూమ్స్ ఏర్పాటు చేయడం ఆనవాయితీగా వస్తోంది. అయితే మామూలుగా.ఈ క్వైట్ రూమ్స్‌ను ఆటగాళ్లు, ఇతర వ్యక్తులు ప్రార్థనలు, మెడిటేషన్స్ కోసం మాత్రమే ఉపయోగించాలనే రూల్ ఉంది. కానీ గత ఏడాది జరిగిన వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ సమయంలో ఈ క్వైట్ రూమ్‌లో అసాంఘిక కార్యకలాపాలు నిర్వహించినట్లు రిపోర్టులు వచ్చాయి. కొంతమంది ఆటగాళ్లు శృంగారంలో పాల్గొనగా, మరికొంతమంది తమ పార్ట్‌నర్స్‌తో ఏకాంతంగా గడిపినట్లు సమాచారం.
ముఖ్యంగా కోర్టు 12కు ఆనుకొని ఉన్న క్వైట్ రూమ్‌లో ఇలాంటివి వెలుగు చూసినట్లు తెలిసింది. అందుకే వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ నిర్వాహకులు ఈసారి టోర్నీ ప్రారంభానికి ముందే ఆటగాళ్లకు, ఇతరులకు ముందే వార్నింగ్ ఇచ్చారు. క్వైట్ రూమ్‌లు కేవలం మెడిటేషన్స్, ప్రార్థనల కోసం మాత్రమే ఉపయోగించాలని, తమ పర్సనల్ పనులు చేయడానికి వీల్లేదని ఆదేశాలు జారీ చేశారు. ఆల్ ఇంగ్లండ్ లాన్ టెన్నిస్ క్లబ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ సాలీ బోల్టన్ ఇదే విషయమై స్పందించారు. ఈ నేపథ్యంలోని సోషల్ మీడియాలో ఒక ట్వీట్ చేశారు.
The prayer 🙏 room @Wimbledon near court 12 is being used for sex 🤣🤣 pic.twitter.com/1ekvVXJBBM
— John Book (@JohnBook007) July 3, 2023
అందుకు సంబంధించిన ట్వీట్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. క్వైట్ రూమ్ అనేది చాలా ముఖ్యం.కేవలం అక్కడ మనసు ప్రశాంతత కోసం ధ్యానం, ప్రార్థనలు మాత్రమే చేయాలి. ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలకు తావు లేదు. ప్రార్థనల కోసం అయితే పర్లేదు. అలాగే తల్లులు తమ పిల్లలకు పాలిచ్చేందుకు కూడా ఇక్కడ సౌకర్యాలు ఉంటాయి. కాబట్టి దీన్ని సరైన మార్గంలో వినియోగించుకోవాలి అని ట్వీట్ లో పేర్కొన్నారు.