Lord Shiva : శివుడికి కాశీ అంటేనే ఎందుకంత ఇష్టం..?
భగవంతుడు అంటేనే విశ్వం.ఆయన విశ్వవ్యాప్తంగా ఉంటారు. అంతటా నిండి ఉన్న దేవుడి తత్తాన్నితెలియజేసే పుణ్యక్షేత్రాలు మాత్రం కొన్ని. అందులో ముఖ్యమైంది వారణాసి.
- By hashtagu Published Date - 10:00 AM, Fri - 10 June 22
 
                        భగవంతుడు అంటేనే విశ్వం.ఆయన విశ్వవ్యాప్తంగా ఉంటారు. అంతటా నిండి ఉన్న దేవుడి తత్వాన్ని తెలియజేసే పుణ్యక్షేత్రాలు మాత్రం కొన్ని. అందులో ముఖ్యమైంది వారణాసి. కైలాససదనంలో కూలాసాగాఉంటున్న శివుడికి …ఒకసారిహిమగిరులు దాటి ఆవతల ఉండాలని మనసు పుట్టింది. పార్వతిదేవితో కలిసి ఏదైనా సిద్ధక్షేత్రంలో నివసించాలని కోరుకున్నాడు. చివరికి కాశీని శివుడు ఎంచుకున్నాడు.
అప్పటికే ఆ ప్రాంతాన్ని రాజధానిగా చేసుకుని దివోదాసు అనే రాజు పాలిస్తున్నాడు. పరమేశ్వరుడి ఆనతితో నికుంభడనే రాక్షసుడు వారణాసికి వెళ్లి అక్కడి ప్రజలను,రాజును తరలించారు.శివుడు నివసించడానికి అనువైన ఏర్పాటు చేస్తాడు.తన రాజ్యం పోయిందనే బాధతో దివోదాసు బ్రహ్మకోసం కఠోర తపస్సు చేస్తాడు. బ్రహ్మ ప్రత్యక్షమై…కాశీరాజు దేవతలుదేవలోకంలో నాగులు పాతాళంలో భూలోకంలో మనుషులు మాత్రమే ఉండే విధంగావరం ఇవ్వమని కోరుతాడు. బ్రహ్మ తథాస్తు అంటాడు. దీంతో కాశీనాథుడు, మళ్లీ కైలాసానికి వెళ్లాల్సినసమయం వస్తుంది.
అక్కడికి వెళ్లినా కూడా శివుడి మనసు మనస్సులో ఉండదు. కాశీలో ఉండటానికి మార్గం సుగుమం చేయమంటూ 64మంది యోగినులను పంపిస్తాడు. దేవతలను గంగాతీరంలో ప్రతిష్టిస్తాడు దివోదాసు. శివాజ్ణతో సూర్యుడు రాగా,ద్వాదశాదిత్య రూపాలుగా గంగ ఒడ్డున ప్రతిష్టస్తాడు. దివోదాసును ఒప్పించేందుకు స్వయంగా బ్రహ్మదేవుడే వారణాసికి వెళ్లుతాడు. ఆయనను మచ్చిక చేసుకున్న రాజు…బ్రహ్మతో గంగాతీరంలో దశాశ్వమేథ హోమం చేయిస్తాడు. చివరకు విష్షుమూర్తి కాశీకి వెళ్లి…దివోదాసుకు జ్ణానోపదేశం చేస్తాడు.ఆవిధంగా శివుడు మళ్లీ కాశీ విశ్వనాథుడు అయ్యాడని స్థలపురాణం చెబుతోంది.
 
                    



