IPL 2022: ఒక్కో ప్లేయర్ కీ ఒక్కో రూలా ?
ఢిల్లీ క్యాపిటల్స్ , రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య నో బాల్ వివాదంలో ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ తీరుపై విమర్శలు వస్తున్నాయి.
- Author : Naresh Kumar
Date : 23-04-2022 - 6:29 IST
Published By : Hashtagu Telugu Desk
ఢిల్లీ క్యాపిటల్స్ , రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య నో బాల్ వివాదంలో ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ తీరుపై విమర్శలు వస్తున్నాయి. ఈ మ్యాచ్ కోసం రిషబ్ పంత్‌కు చెల్లించే మ్యాచ్ ఫీజులో 100 శాతం కోత విధించగా, శార్దూల్ ఠాకూర్‌కు 50 శాతం ఫైన్ విధించారు. అలాగే ఈ మ్యాచ్ మధ్యలో మైదానంలోకి వెళ్లి అంపైర్లతో వాగ్వాదానికి దిగిన ఢిల్లీ కోచ్ ప్రవీణ్ ఆమ్రేపై 100 శాతం జరిమానాతో పాటు ఓ మ్యాచ్ నిషేధం విధించింది.
ఈ నేపథ్యంలో ఐపీఎల్ లో ఇంతకుముందు కూడా ఇలాంటి సంఘటనే జరిగింది. ఐపీఎల్ 2019 సీజన్లో రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్లోఅప్పటి చెన్నై సూపర్ కింగ్స్ సారథి ఎంఎస్ ధోని కూడా ఇలానే అంపైర్ల వ్యతిరేకంగా ప్రవర్తించాడు. చెన్నై జట్టు విజయానికి 3 బంతుల్లో 8 పరుగులు కావాల్సిన సమయంలో బౌలర్ బాగా ఎత్తులో ఫుల్ టాస్ బంతిని వేశాడు. అయితే దీన్ని ఫీల్డ్ అంపైర్ నో బాల్ ఇవ్వకవడంతో డగౌట్లో ఉన్న ధోని కోపంతో మైదానంలోకి దూసుకొచ్చి అంపైర్‌తో మాటల యుద్దానికి దిగాడు.
అయితే ప్రస్తుతం ఆ సమయంలో ఐపీఎల్ పాలకమండలి ధోనిపై ఎలాంటి క్రమశిక్షణ చర్యలు తీసుకోలేదు. ఆ మ్యాచ్ మ్యాచ్ ఫీజులో 50 శాతం జరిమానా విధించింది. అయితే నాడు ధోనిని వదిలేసిన ఐపీఎల్ పాలకమండలి ఇప్పుడు పంత్ పై మాత్రం సీరియస్ యాక్షన్ తీసుకుంది. అలాగే రిషబ్ పంత్ పై నిషేధం విధించాలి అనే అంశంపై కూడా ఐపీఎల్ పెద్దలు చర్చించినట్లు తెలుస్తోంది.ఈ నేపథ్యంలో రిషబ్ పంత్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ధోనికో న్యాయం పంత్‌కో న్యాయమా అంటూ ఐపీఎల్ పెద్దలపై మండిపడుతున్నారు.
When MS Dhoni lost his cool https://t.co/9GjQ7hJWtt via @ipl
— Naresh kumar Pradhan (@iam_naresh7) April 11, 2019