Chicken Church: చికెన్ చర్చి.. ఎక్కడ ఉంది.. దానికి ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా?
- By Anshu Published Date - 03:28 PM, Sat - 4 June 22

ఈ రంగు రంగుల ప్రపంచంలో ఎన్నో చిత్రవిచిత్రమైన భవనాలు ఉన్నాయి. అలాంటి వారిలో ఇండోనేషియాలోని భాషలో గెరెజా ఆయమ్ కూడా ఒకటి. గెరెజా ఆయమ్ అనగా ఇంగ్లీషులో చికెన్ చర్చి అని అర్థం. చికెన్ చర్చి అని పిలవడానికి గల కారణం కూడా లేకపోలేదు. ఈ చర్చి కూడా చూడటానికి అచ్చం కోడి ఆకారంలో ఉంటుంది. సెంట్రల్ జావాలోని… మాజెలాంగ్ ఏరియాలో ఈ చర్చి మనకు కనిపిస్తుంది. అయితే నిజానికి ఈ చర్చిని పావురం ఆకారంలో నిర్మించాలని అనుకున్నప్పటికీ పావురం శాంతికి చిహ్నం కాబట్టి… శాంతియుతమైన చర్చిగా దీన్ని ప్రజలు భావిస్తారని అనుకున్నారు కానీ ఈ భవనం తీరా నిర్మించిన తర్వాత చూస్తే… ఇది కోడి ఆకారంలో కనిపించింది.
దాంతో చికెన్ చర్చిగా వరల్డ్ ఫేమస్ అయ్యింది. ఈ చికెన్ చర్చి వెనక కొన్ని ఊహలు, అపోహలూ వినిపించాయి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. డేనియల్ అలమ్స్ జా అనే వ్యక్తి తనకు నిద్రలో కలరాగా ఆ తర్వాత కాసేపటికి నిద్రలేచి అప్పటివరకు తనకి ఏదో ఒక అద్భుతమైన కల వచ్చినట్లు ఫీల్ అయ్యి అని గుర్తు చేసుకుంటూ దేవుడు కోసం ఒక భవనాన్ని నిర్మించి ఇస్తానని ప్రకటించాడు. నిర్మించిన ఈ భవనం ఏ ఒక్క మతానికి చెందినది కాదని అన్ని మతాల వారు వచ్చి అందులో ప్రార్థనలు చేసుకునే విధంగా వీలు కల్పిస్తామని ప్రకటించారు.
ఈ చర్చి నిర్మాణం మొదలు అయిన తరువాత అతనికి ఎన్నో రకాల సమస్యలు వెంటాడాయి. ఒకవైపు ఆర్థిక సమస్య మరొకవైపు,స్థానికుల నుంచి సమస్యలు. అయితే మధ్యలో డేనియల్ అలమ్స్ జా కి డబ్బు కొరత కూడా బాగా వేధించింది. రెండువేల సంవత్సరంలో చివరిదశకు వచ్చిన తరువాత ఈ నిర్మాణ పనులు ఆగిపోయాయి. ఆ తరువాత ఆ భవనం క్రమక్రమంగా పాతదై పోతూ వచ్చింది. డేనియల్ అలమ్స్ జా ప్రపంచ దేశాల ప్రజలకు నచ్చడంతో అన్ని మతాలను సమానంగా చూస్తూ ఆయన నిస్వార్థంతో ఈ భవన నిర్మాణం చేపట్టారని కానీ స్థానిక ప్రజలు దానిని చర్చిగా ప్రకటిస్తూ ఆయన తప్పుబట్టారు అంటూ ఆ భవనంపై పాజిటివ్ గా వార్తలు రావడం వినిపించాయి. అలా ఆ చర్చి పూర్తి అయ్యింది. ఇక ప్రస్తుతం ఆ చర్చి కోడి చర్చి పేరుతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందింది. ఇక అక్కడికి టూరిస్టులు పెద్ద ఎత్తున వచ్చి సెల్ఫీలు వీడియోలు ఫోటోలు తీసుకుంటూ ఉంటారు. అంతేకాకుండా కొన్ని సినిమాల షూటింగ్ కూడా ఇక్కడే జరిగాయి. అలా ఇది ఒక రకమైన శరణార్థి భవనంగా మారింది.