Tamannaah Bhatia: మా ఇద్దరి మధ్య మంచి బంధం ఏర్పడింది: తమన్నా
విజయ్‌వర్మతో తన రిలేషన్‌పై కొన్ని రోజులుగా వస్తున్న వార్తలపై తమన్నా క్లారిటీ ఇచ్చింది.
- Author : Balu J
Date : 14-06-2023 - 11:12 IST
Published By : Hashtagu Telugu Desk
బాలీవుడ్ హీరో విజయ్‌వర్మతో తన రిలేషన్‌పై కొన్ని రోజులుగా వస్తున్న వార్తలపై తమన్నా క్లారిటీ ఇచ్చింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. అతడితో ఉంటే తాను సంతోషంగా ఉంటానని చెప్పింది. తాను విజయ్ వర్మతో ఎంతో చనువుగా ఉంటున్నానంటే దానికి కారణం అతడు కేవలం నా సహనటుడని మాత్రమే కాదని, తమ ఇద్దరి మధ్య మంచి బంధం ఉందని తెలిపింది. ఎవరినైనా ప్రేమించాలంటే వాళ్లతో ఉంటే మనం సంతోషంగా ఉంటామనే భావన మనకు కలగాలని ఆమె చెప్పింది. విజయ్ ఉంటే తనకు అలానే ఉంటుందని తెలిపింది. తాను ఇప్పటి వరకు ఎంతోమంది హీరోలతో కలిసి నటించానని, వాళ్లందరి కంటే తనకు విజయ్ ప్రత్యేకమైన వ్యక్తి అని తమన్నా చెప్పింది.
అతడు తనను ఎప్పటికీ జాగ్రత్తగా చూసుకుంటాడని, తనకు కష్టం వస్తే తనతోనే ఉంటాడనే నమ్మకం ఉందని వివరించింది. ఏ రంగంలోనైనా ముఖ్యంగా సినీ పరిశ్రమలో మనం ఎదుగుతున్నామంటే కిందకు లాగడానికి చాలామంది ప్రయత్నిస్తుంటారు.. విజయ్ అలాంటి వాళ్లనుంచి నన్ను రక్షిస్తాడు.. అంటూ తమన్నా తెలిపింది.`నా కోసం నేను ఒక అందమైన ప్రపంచాన్ని సృష్టించుకున్నాను. అందులోకి నన్ను నన్నుగా అర్థం చేసుకునే విజయ్ వర్మ వచ్చాడు. అతడు నాపై ఎంతో శ్రద్ధ వహిస్తాడు. అతడు ఎక్కడ ఉంటే అక్కడే నా సంతోషం ఉంది. మా ఇద్దరి మధ్య మంచి ఆర్గానిక్ బంధం ఉంది` అని తమన్నా చెప్పింది. ఈ నెల 29న ఓటీటీ వేదికగా విడుదల కానున్న `లస్ట్ స్టోరీస్ 2` సెట్స్‌లోనే తమ ఇద్దరి మధ్య బంధం మొదలైనట్టు తెలిపింది.