Watch Video: డ్రైవర్ మానవత్వం.. నెటిజన్స్ ఫిదా
చిన్న చిన్న పనులకు ఎన్నో ఇబ్బందులు పడుతుంటారు వికలాంగులు. అందుకే ఎవరో ఒకరు తోడుగా ఉంటేనే తప్ప బయటకు వెళ్లలేని పరిస్థితి.
- Author : Balu J
Date : 03-05-2022 - 4:50 IST
Published By : Hashtagu Telugu Desk
చిన్న చిన్న పనులకు ఎన్నో ఇబ్బందులు పడుతుంటారు వికలాంగులు. అందుకే ఎవరో ఒకరు తోడుగా ఉంటేనే తప్ప బయటకు వెళ్లలేని పరిస్థితి. చిన్న సాయానికి కూడా ఇతరులపై ఆధారపడాల్సిందే. ఉరుకుల పరుగుల జీవితంలో అలాంటివాళ్లను పట్టించుకునేవాళ్లు ఉంటారా.. అంటే ఇదిగో నేనున్నా అంటున్నాడు ఈ డ్రైవర్. ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడం బాధ్యతగా భావించాడు. ఓ వికలాంగుడైన వ్యక్తి తన వీల్ చైర్‌లో కాలిబాటపైకి వెళ్లడానికి ఎంతగానో కష్టపడ్డాడు. ఇది గమనించిన ఓ డ్రైవర్ వెంటనే తన ఫుడ్ డెలివరీ వాహనాన్ని పక్కకు ఆపాడు. అతని దగ్గరకు వెళ్లి ట్రైసైకిల్ ను ముందుకు నెట్టి సరైన మార్గంలో వెళ్లేలా సాయం చేశాడు. డ్రైవర్ మానవత్వానికి శభాష్ అంటున్నారు నెటిజన్స్. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.