Varanasi Blasts: వారణాసి పేలుళ్ల కేసులో వలీ ఉల్లాఖాన్ కు మరణశిక్ష..!!
2006లో వారణాసిలో జరిగిన బాంబు పేలుళ్ల కేసులో ఇటీవలే దోషిగా తేలిన సూత్రధారి వలీ ఉల్లాఖాన్ కు ఘజియాబాద్ కోర్టు సోమవారం మరణశిక్ష ఖరారు చేసింది. ఆనాటి బాంబు పేలుళ్ల ఘటనలో 20 మంత్రి ప్రాణాలు కోల్పోయారు.
- Author : hashtagu
Date : 07-06-2022 - 8:33 IST
Published By : Hashtagu Telugu Desk
2006లో వారణాసిలో జరిగిన బాంబు పేలుళ్ల కేసులో ఇటీవలే దోషిగా తేలిన సూత్రధారి వలీ ఉల్లాఖాన్ కు ఘజియాబాద్ కోర్టు సోమవారం మరణశిక్ష ఖరారు చేసింది. ఆనాటి బాంబు పేలుళ్ల ఘటనలో 20 మంత్రి ప్రాణాలు కోల్పోయారు. 100కు పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు మూడు కేసులు నమోదు చేశారు. ఈ మూండింటిలోనూ వలీ ఉల్లాఖాన్ కు మరణశిక్ష విధించింది కోర్టు. హత్యామత్నం కేసులో జీవిత ఖైదు, జరిమానాను విధించింది.
అతడిపై మోపిన మూడో కేసులో బలమైన సాక్ష్యాలు లేకపోవడంతో ఖాన్ ను నిర్ధోషిగా ప్రకటించింది కోర్టు. అప్పట్లో ఖాన్ తరపున వాధించేందుకు వారణాసికి చెందిన న్యాయవాదులు ఎవరూ ముందుకు రాలేదు.దీంతో ఈ కేసును ఘజియాబాద్ కోర్టుకు అలహాబాద్ హైకోర్టు బదిలీ చేసింది. ఇప్పుడు ఇదే కోర్టు వలీ ఉల్లాఖాన్ కు మరణశిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది.