Vivek Plan Vs Ukraine War : అక్కడ రష్యాను ఓడించకుండానే.. అమెరికాను గెలిపిస్తా : వివేక్
Vivek Plan Vs Ukraine War : రష్యా - ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపేందుకు తన దగరున్న ప్లాన్ ను అమెరికా అధ్యక్ష అభ్యర్ధిత్వ రేసులో ఉన్న రిపబ్లికన్ నేత వివేక్ రామస్వామి వెల్లడించారు.
- By Pasha Published Date - 04:50 PM, Sat - 19 August 23

Vivek Plan Vs Ukraine War : రష్యా – ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపేందుకు తన దగరున్న ప్లాన్ ను అమెరికా అధ్యక్ష అభ్యర్ధిత్వ రేసులో ఉన్న రిపబ్లికన్ నేత వివేక్ రామస్వామి వెల్లడించారు. రష్యాను ఓడించకుండానే.. అమెరికాను గెలిపించేలా తాను ప్రణాళికను అమలు చేస్తానని ఆయన తెలిపారు. అమెరికాకు చెందిన ఒక జర్నలిస్ట్ తనకు వివేక్ రామస్వామి ఇచ్చిన ఇంటర్వ్యూ వివరాలతో ట్విట్టర్ లో ఒక పోస్ట్ చేశారు. వివేక్ చెప్పిన మాటలపై ఇంకా ఇలా రాసుకొచ్చారు.. “నేను అమెరికా ప్రెసిడెంట్ అయితే ఉక్రెయిన్‌కు చెందిన ప్రాంతాలు రష్యా ఆధీనంలోనే ఉండటానికి అనుమతిస్తాను. నాటోలో ఉక్రెయిన్ చేరకుండా నిరోధిస్తాను. మాస్కోకు వెళ్లి పుతిన్‌ను కలుసుకుంటాను. ఎలాగోలా నేను ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగిస్తాను. చైనాతో ఉన్న సైనిక పొత్తు నుంచి బయటకు రావాలని పుతిన్ కు చెబుతాను. రష్యా ఓడిపోయేలా కాకుండా.. అమెరికా గెలిచేలా మన లక్ష్యం ఉండాలి” అని ఇంటర్వ్యూలో వివేక్ రామస్వామి అభిప్రాయపడ్డారని జర్నలిస్టు వివరించారు.
Also read : Fake Transgenders: నగరంలో నకిలీ ట్రాన్స్ జెండర్స్.. డబ్బులు దండుకుంటున్న బిహార్ ముఠా!
“రష్యా-చైనా సైనిక కూటమి అనేది ప్రస్తుతం అమెరికా ఎదుర్కొంటున్న ఏకైక సైనిక ముప్పు. అమెరికా, చైనా కంటే.. హైపర్ సోనిక్, అణ్వస్త్ర సామర్థ్యంలో రష్యా ఎంతో ముందుంది. నావికా దళం సామర్థ్యంలో మనకంటే చైనా ముందు వరుసలో ఉంది. దీని గురించి ఎవరూ మాట్లాడటం లేదు. అన్నింటి కంటే దారుణ విషయం ఏమిటంటే.. ఉక్రెయిన్‌కు అమెరికా అందిస్తున్న సహకారం రష్యాను చైనాకు దగ్గర చేస్తోంది” అని వివేక్ రామస్వామి(Vivek Plan Vs Ukraine War) ప్రస్తుత పరిస్థితులను విశ్లేషించారు.
Also read : CBN Dilemma : ఢిల్లీ బీజేపీ డేంజర్ గేమ్ ! జగన్ కోసం పవన్ CM నినాదం!!