Vishnuvardhan Reddy : ఉండవల్లి…ఊసరవెల్లి రాజకీయాలు మానుకోండి..!!
తెలంగాణ సీఎం కేసీఆర్ జాతీయ స్థాయిలో పార్టీని పెట్టబోతున్నారన్న ప్రచారం పెద్దెత్తున సాగుతోంది. దీనికి అనుగుణంగానే ఆయన పలువురు రాజకీయ ప్రముఖులతో వరుసగా భేటీ అవుతున్నారు.
- Author : hashtagu
Date : 14-06-2022 - 1:11 IST
Published By : Hashtagu Telugu Desk
తెలంగాణ సీఎం కేసీఆర్ జాతీయ స్థాయిలో పార్టీని పెట్టబోతున్నారన్న ప్రచారం పెద్దెత్తున సాగుతోంది. దీనికి అనుగుణంగానే ఆయన పలువురు రాజకీయ ప్రముఖులతో వరుసగా భేటీ అవుతున్నారు. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ ను ఏపీకి చెందిన మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఆదివారం కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. దాదాపు 3గంటలపాటు వీరు సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత కిషోర్ కూడా ఉన్నారు.
అయితే సీఎం కేసీఆర్ ను కలిసిన ఉండవల్లి అరుణ్ కుమార్ పై ఏపీ బీజేపీ నేత విష్ణువర్దన్ రెడ్డి ఫైర్ అయ్యారు. రాజకీయాలకు తాను దూరం అని చెబుతూనే…రాజకీయాల గురించి మాట్లాడుతుంటారని…పలువురు రాజకీయనేతలను కలుస్తుంటారని..వీటి గురించి ప్రశ్నిస్తే…అదేం లేదండి…ఉత్తినే అంటారని ఎద్దేవా చేశారు. ఉండవల్లి ఊసరవెళ్లి రాజకీయాలు మానుకోండి అంటి సలహా ఇచ్చారు. మీ ద్రుష్టిని బీజేపీ మీద నుంచి మళ్లించి…మీకు రాజకీయ భిక్షను ప్రసాదించిన కాంగ్రెస్ ను పైకి లేపడంపై ద్రుష్టి పెట్టండంటూ సూచించారు.