Pakistan: 32 చిన్న మహిళను పెళ్లి చేసుకున్న పాకిస్థాన్ టీచర్.. ఇదెక్కడి వింత అంటూ?
ప్రేమ అన్నది ఎప్పుడూ ఎవరి మధ్య ఎలా కలుగుతుందో చెప్పడం చాలా కష్టం. ఈ ప్రేమ అని రెండు అక్షరాల పదం
- Author : Anshu
Date : 02-11-2022 - 6:00 IST
Published By : Hashtagu Telugu Desk
ప్రేమ అన్నది ఎప్పుడూ ఎవరి మధ్య ఎలా కలుగుతుందో చెప్పడం చాలా కష్టం. ఈ ప్రేమ అని రెండు అక్షరాల పదం జీవితాలనే మార్చేస్తూ ఉంటుంది. అయితే ఈ ప్రేమకి వయసు లేదు అని అంటూ ఉంటారు. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక జంట నిజమే అని నిరూపిస్తోంది. ఒక యువతి తన తండ్రి లాంటి వయసున్న వాడిని పెళ్లి చేసుకుంది. వినడానకే విడ్డూరంగా ఈ ఘటన పాకిస్తాన్లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. 20 ఏళ్ల ఒక యువతి 52 ఏళ్ల ఒక టీచర్ ని పెళ్లి చేసుకుంది. కాగా ఆమె కంటే అతని వయసు 32 సంవత్సరాలు పెద్ద.
అతని వ్యక్తిత్వానికి ఫిదా అయిన ఆమె అతనితో ప్రేమలో పడినట్టు చెప్తుంది. ఆ యువతి పేరు జోయా నూర్. ఆమె ప్రస్తుతం డిగ్రీ చదువుతోంది. ఈ నేపథ్యంలోనే ఆమె తన టీచర్ అయిన సాజిద్ ఆలీతో ప్రేమలో పడింది. అదే విషయాన్ని తెలియజేయగా అతడు సున్నితంగా తిరస్కరించాడు. కానీ ఆమె మాత్రం ఆ విషయాన్ని వదిలేయకుండా పెళ్లి చేసుకుంటాను అని చెప్పడంతో అతను ఒక వారం రోజులు సమయం కావాలని కోరాడు. చివరికి ఆ యువతని పెళ్లి చేసుకోవడానికి సిగ్నల్ ఇచ్చాడు.
https://youtu.be/NzgDlU9RID0
ఇక ఆ తర్వాత జోయా నూర్ తన ప్రేమ వ్యవహారం గురించి ఇంట్లో వాళ్లకు చెప్పగా వాళ్లు ససేమీరా అన్నారు. అయినప్పటికీ ఆమె తల్లిదండ్రులను కాదని సాజిద్ అలీ ని పెళ్లి చేసుకుంది. జోయా నూర్ అద్భుతంగా వంట చేస్తుందని, ఆమె వండిన ఆహారం అంతే తనకు ఎంతో ఇష్టం అని సాజిద్ అలీ తెలిపాడు. అంతేగాక ఆమె చేసే టీకి తాను అభిమాని ని చెప్పుకొచ్చాడు సాజిద్ అలీ. కాగా ప్రస్తుతం వీళ్ల లవ్‌స్టోరి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీరికి మద్దతుగా నిలుస్తూ కొత్త జంటపై నెటిజన్లు ప్రేమను కురిపిస్తున్నారు. కొందరు మాత్రం ముసలోనికి ఈ వయసులో ఇదేం పోయే కాలం అంటూ కామెంట్స్ చేస్తున్నారు.