Car @ Rs 1100Cr: ప్రపంచంలోనే అత్యంత ఖరీదుకు అమ్ముడుపోయిన కారు..ఏదో తెలుసా..!!
ప్రపంచంలో అత్యంత ఖరీదైనా కారు ఏదో మీకు తెలుసా..? 1955 మెర్సిడెజ్-బెంజ్ 300SLRఉహ్లెన్హాట్ కూపే కారు.
- By Hashtag U Published Date - 06:45 AM, Sat - 21 May 22
ప్రపంచంలో అత్యంత ఖరీదైనా కారు ఏదో మీకు తెలుసా..? 1955 మెర్సిడెజ్-బెంజ్ 300SLRఉహ్లెన్హాట్ కూపే కారు. అమెరికాలో జరిగిన వేలంలో ఈ బెంజ్ కారు 143 మిలియన్ డాలర్లు…అంటే సుమారు రూ. 1100కోట్లకు విక్రయించబడింది. బ్రిటీష్ కార్ కలెక్టర్ సైమన్ కిడ్సన్ ఎవరికీ తెలియకుండా ఒక పేరులేని క్లయింట్ తరపున వేలం వేశారు. ఈ పాతకాలపు కూపేకి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి.
1955లో డిజైన్ చేసిన మెర్సిడెస్ -బెంజ్ కంపెనీ రేసింగ్ డిపార్ట్ మెంట్ ఇప్పటివరకు తయారు చేసిన రెండు నమూనాల్లో ఒకటి. ఉహ్లెన్హాట్ కూపే అనే పేరు దాని చీఫ్ ఇంజనీర్ రుడాల్ఫ్ ఉహ్లెన్హాట్ ద్వారా పెట్టారు. జువాన్ మాన్యుయోల్ ఫాంగియే ఈ గ్రాండ్ ప్రిక్స్ కారుపై నడపడి రెండు ప్రపంచ ఛాంపియన్ షిప్స్ ను గెలుచుకున్నాడు. కారు స్పోర్ట్స్ రేసింగ్ కోసం శక్తివంతమైన 3.0లీటర్ ఇంజన్ను కలిగి ఉంది. గరిష్టంగా 180 కిలోమీటర్ల స్పీడ్ తో వెళ్తుంది.
కెనడియన్ క్లాసిక్ కారు వేలం కంపెనీ అధినేత RMసోత్ బై మే 5న మెర్సిడెస్ బెంజ్ స్టట్గార్ట్ కారును భారీ మొత్తం వెచ్చించి కొన్నారు. వేలంలో సేకరించిన మొత్తం యువతకు పర్యావరణ శాస్త్రం డీకార్బనైజేషన్ రంగాల్లో విద్యా, పరిశోధన స్కాలర్ షిప్స్ ను అందించడానికి ఉపయోగించబడుతుంది.